అప్పుడు బావ.. తమ్ముడు.. ఇప్పుడు బన్నీ

Thu Apr 20 2017 11:38:17 GMT+0530 (IST)

హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే- దువ్వాడ జగన్నాధం మూవీని అల్లు అర్జున్ ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం కోసం బన్నీ ఇంకో 2-3 వారాల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. కీలకమైన క్లైమాక్స్ పార్ట్ కూడా ఇందులో ఉంది. ఇలా డీజే షూట్ పూర్తి చేయగానే.. రీసెంట్ గా అనౌన్స్ చేసిన వక్కంతం వంశీ మూవీని మొదలుపెట్టేస్తాడు అల్లు అర్జున్.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు పీక్ స్పీడ్ లో ఉండగా.. లొకేషన్స్ ను ఫైనలైజ్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలో చేయనున్నారట. ముఖ్యంగా కశ్మీర్ లోని అందమైన లొకేషన్లలో కొన్ని సన్నివేశాలతో పాటు.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేయాలని తలపెట్టారని తెలుస్తోంది. కశ్మీర్ లో ఈ మధ్య మెగా హీరోల షూటింగ్స్ ఎక్కువగానే జరుగుతున్నాయి. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో.. ప్రారంభంలో సాగే ఎపిసోడ్ అంతా కశ్మీర్ లోనే షూట్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కశ్మీర్ లో చాలా కాలమే గడిపాడు.

ధృవ మూవీ కోసం మొత్తం యూనిట్ అంతా.. కశ్మీర్ ప్రాంతంలో నెలల పాటు గడిపారు. రెండు పాటలు.. ట్రైనింగ్ ఎపిసోడ్.. కొన్ని సీన్స్.. ఇలా ధృవలో చాలా భాగమే కశ్మీర్ లో పిక్చరైజ్ చేశారు. ఇప్పుడు బన్నీ కూడా కశ్మీర్ కే ఫిక్స్ అయ్యాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ దేశభక్తి చిత్రం కాగా.. మూవీకి కీలకమైన ఎపిసోడ్ ఇక్కడే తీస్తారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/