బన్నీకి మళ్ళీ బ్రేక్?

Mon Dec 10 2018 13:43:44 GMT+0530 (IST)

నా పేరు సూర్య ఏ ముహూర్తంలో ఒప్పుకున్నాడో కానీ దాని ఫలితం వచ్చినప్పటి నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కొత్త సినిమా ఏదీ సెట్ కావడం లేదు. క్రమం తప్పకుండ కథలు వింటున్నా దర్శకులను కలుస్తున్నా ఏదీ కార్యరూపం దాల్చడం లేదు. ఆ మధ్య విక్రమ్ కుమార్ తో ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని చాల హంగామా జరిగింది. తీరా చూస్తే కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో విక్రమ్ అది వదిలేసి హ్యాపీగా నానితో ప్రాజెక్ట్ చేసేందుకు ఫిబ్రవరి నుంచి రెడీ అవుతున్నాడు.ఇలాంటివి మాములే కాబట్టి లైట్ తీసుకున్న బన్నీ అరవింద సమేత వీర రాఘవతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం ఎదురు చూసాడు. ఇది డిసెంబర్ లో స్టార్ట్ కావొచ్చు అనే లీక్స్ మీడియాకు  అందాయి. ఒక హిందీ రీమేక్ అనుకుని తర్వాత డ్రాప్ అయ్యి ఓ కొత్త కథను త్రివిక్రమ్ వండుతున్నాడని టాక్ జోరుగానే వినిపించింది. అయితే ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్ మూవీ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చట. త్రివిక్రమ్ చెప్పిన ఒక లైన్ బన్నీ డాడీ అల్లు అరవింద్ ను కన్విన్స్ చేయలేకపోయిందని దానికి తోడు అల్లు అర్జున్ కూడా దాని మీద సందేహం వ్యక్తం చేయడంతో ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్.

సో బన్నీకి మళ్ళి ఎదురు చూపులు తప్పనట్టే . ఇప్పటికిప్పుడు ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్న దర్శకుడు ఎవరూ అందుబాటులో లేరు. అందరు ఉన్న ప్రాజెక్ట్స్ లో బిజీ కావడమే కాక నెక్స్ట్ మూవీకి సైతం హీరోలను లాక్ చేసుకున్నారు. వివి వినాయక్ లాంటి ఒకరిద్దరు తప్ప అందరూ బిజీనే. మరి అల్లు అర్జున్ ఇప్పుటికిప్పుడు ఏం చేస్తాడో అన్నది సస్పెన్స్. త్రివిక్రమ్ మూవీ హోల్డ్ లోకి వెళ్ళిందన్న వార్త అధికారికం కాదు కాని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది