Begin typing your search above and press return to search.

కన్ఫామ్‌: బన్నీ-హరీశ్‌ ఫిలిం.. రేపే స్టార్ట్

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:39 AM GMT
కన్ఫామ్‌: బన్నీ-హరీశ్‌ ఫిలిం.. రేపే స్టార్ట్
X
వరుసపెట్టి సినిమాలను మొదలెట్టేస్తున్న నిర్మాత దిల్‌ రాజు. నిన్ననే శతమానం భవతి సినిమాను మొదలెట్టిన రాజు గారు.. ఇప్పుడు మరో సినిమాను మొదలెట్టబోతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేయకుండా కేవలం చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈయన.. ఇప్పుడు ఒక పెద్ద సినిమా స్టార్ట్ చేయబోతున్నారు.

వరుసపెట్టి భారీ హిట్లు కొడుతున్న అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. ముందుగా వినిపిస్తున్నట్లే.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ను మెగా ఫ్యామిలీకి అందించిన హరీశ్ శంకర్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా రోజుల నుండి కథ మీద కసరత్తులు చేస్తున్న హరీశ్ శంకర్.. ఫైనల్ గా బ్రహ్మాండమైన కథతో పాటు కత్తిలాంటి డైలాగులు కూడా రెడీ చేశాడు. అందుకే ఈ సినిమాను రేపు ఉదయాన్నే మొదలెట్టేస్తున్నారు. సోమవారం (ఆగస్టు 29న) ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ముహూర్తం రెడీ చేశారట.

మొత్తానికి అనుకున్నట్లే బన్నీ అండ్ హరీశ్‌ శంకర్ సినిమా మొదలవుతోంది. మరో గబ్బర్ సింగ్ కొట్టాలని హరీశ్.. తన విజయాలపరంపరను కొనసాగించాలని బన్నీ చూస్తున్నారు. అది సంగతి.