Begin typing your search above and press return to search.

సరైనోడు.. సరిగ్గా ఇదే ఫిక్సయ్యిందా?

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:56 AM GMT
సరైనోడు.. సరిగ్గా ఇదే ఫిక్సయ్యిందా?
X
బ‌న్ని హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న సినిమాకి టైటిల్ స‌స్పెన్స్ వీడ లేదింకా. ఇప్ప‌టికే ఈ చిత్ర క‌థానాయిక ర‌కూల్ ప్రీత్ సింగ్ స‌రైనోడు అనే టైటిల్ ని ఓపెన్‌ గా ప్ర‌క‌టించింది. నా రెండు సినిమాలు నాన్న‌కు ప్రేమ‌తో - స‌రైనోడు వెంట వెంట‌నే రిలీజైపోతాయి అంటూ క్లూ ఇచ్చేసింది. అలాగే బ‌న్ని సైతం నా చిత్రానికి స‌రైనోడు టైటిల్ అంటూ రుద్రమదేవి ప్రమోషన్లలో లీక్ చేశాడు.

అయితే ఈ టైటిల్ ఫిక్సేనా? అనే దానికి పూర్తి క్లారిటీ లేదింకా. దీనిని బో్య‌పాటి శ్రీ‌ను అధికారికంగా క‌న్ఫ‌మ్ చేయ‌డం లేదింకా. ఇదింకా వ‌ర్కింగ్ టైటిల్ అనే అనుకుంటున్నాం. అధికారికంగా ఇదే టైటిల్ అని చెప్ప‌డం లేదు.. అని అన్నాడు. ఇప్ప‌టికే ఈ టైటిల్ బ‌న్ని ఫ్యాన్స్‌ లోకి, ఆడియెన్ మైండ్‌ లోకి దూసుకెళ్లిపోయింది. బ‌న్నికి త‌గ్గ‌ట్టే సరైనోడు బాగానే ఉంద‌ని టాక్ వినిపించింది. అయితే స‌రైనోడు ఏంటి? ఇందులో ఏదో కి్క్కు మిస్స‌య్యిందే అని విమ‌ర్శించిన వాళ్లు ఉన్నారు. బ‌న్ని ఎన‌ర్జీకి త‌గ్గ‌ట్టు ఈ టైటిల్ లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అధికారికంగా టైటిల్‌ ని ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

కాకపోతే ఇటు బన్నీ.. అటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పదే పదే ''సరైనోడు'' అంటూ చెబుతన్నారంటే.. ఖచ్చితంగా ఈ టైటిల్‌ ఫిక్సయ్యిందనే అనుకోవాలి మరి. త్వరలోనే మరి ఏదైనా ఫస్టు లుక్‌ ను విడుదల చేసి టైటిల్‌ కన్‌ ఫామ్‌ చేయండి బాసూ. బాలీవుడ్‌ లో చూడండి... సినిమా మొదలెట్టే ముందే టైటిల్‌ చెబుతున్నారు.. మన దగ్గరే ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఆఖరి వరకు సస్పెన్సు పెట్టే అనవసరమైన హడావుడి!!