Begin typing your search above and press return to search.

తమ్ముడి సినిమాపై స్పందించిన బన్నీ!

By:  Tupaki Desk   |   26 July 2016 9:59 AM GMT
తమ్ముడి సినిమాపై స్పందించిన బన్నీ!
X
మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమాకి పరశురాం (బుజ్జీ) దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ తాజాగా విడుదలయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ ట్రైలర్ పై సినీ జనాలతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ.. తన తండ్రి - నిర్మాత అల్లు అరవింద్ - తమ్ముడు హీరో శిరీష్ - హీరోయిన్ లావణ్య ఇంకా చిత్ర యూనిట్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో పాటు ఈ సినిమా ట్రెయిలర్ ను కూడా షేర్ చేశాడు.

నటుడిగా మంచి మార్కులే పొందినా హిట్ మాత్రం దూరంగానే ఉండటంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ధ్యేయంతో శిరీష్ ఉన్నాడు. ట్రైలర్ ద్వారా చాలా ఆసక్తిని కలిగిస్తూ... ప్రకాష్ రాజ్ - సుమలత - బ్రహ్మానందం - రావు రమేష్ వంటి భారీ తారాగణంతో నిండి ఉన్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.