Begin typing your search above and press return to search.

బన్నీ మిడిల్ డ్రాప్ అయ్యాడటగా

By:  Tupaki Desk   |   18 Jan 2018 7:38 AM GMT
బన్నీ మిడిల్ డ్రాప్ అయ్యాడటగా
X
నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ తో బన్నీ తన కెరీర్ లో ఎన్నడు లేని విధమైన హైప్ ని ఒక్కసారిగా క్రియేట్ చేశాడు. తన నటనతో అందరిని తన వైపుకు తిప్పుకువడంతో స్టైలిష్ స్టార్ మళ్లీ రికార్డులను బద్దలు కొట్టడం పక్కా అనిపిస్తోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఇప్పుడు ఆ సినిమా కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నా పేరు సూర్యా షూటింగ్ చివరి దశలో ఉంది. మరొక నెలలోగా దర్శకుడు వక్కంతం వంశీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ చేయనున్నాడు. మొత్తంగా సినిమాను ఏప్రిల్ లో అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనే విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతవరకు దాని గురించి బన్నీ ఎటువంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయలేదు. మరి ఏ తరహాలో ఉండే కథని ఎంచుకుంటాడా అని అభిమానుల్లో ఒక అనుమానం ఉంది. గత కొంత కాలంగా వినిపిస్తోన్న రూమర్స్ ప్రకారం తమిళ్ అలాగే తెలుగులో ఒక ద్విభాష చిత్రాన్ని చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆవారా దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఆ సినిమా తెరకెక్కనుందని ఎన్నో రూమర్స్ వచ్చాయి.

అయితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం బన్నీ ఈ ప్రాజెక్టు విషయంలో మిడిల్ డ్రాప్ అయ్యాడని అంటున్నారు. లింగుస్వామి తో గత కొంత కాలం కథా చర్చలు నడిపిన సంగతి నిజమే కానీ.. ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకోవట్లేదట. అందుకు స్పైడర్ కూడా ఓ కారణం అని తెలుస్తోంది. మహేష్ స్పైడర్ తమిళ్ తెలుగు నేటివిటి కలగలిపిన సినిమా కావడంతో ఎవరికి నచ్చలేదు. దీంతో లింగుస్వామి ప్రాజెక్ట్ కూడా దాదాపు అలానే ఉందని బన్నీ మరో కథను వెతికే పనిలో పడ్డాడని తెలుస్తోంది. మరి అల్లు హీరో నెక్స్ట్ ఏలాంటి కథను ఒకే చేస్తాడో తెలియాలంటే సమ్మర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.