Begin typing your search above and press return to search.

డీజే తర్వాత.. బన్నీ సినిమాలివే

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:29 AM GMT
డీజే తర్వాత.. బన్నీ సినిమాలివే
X
గతేడాది సరైనోడుతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం మూవీలో నటిస్తున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన సమ్మర్ లోనే డీజే మూవీని రిలీజ్ చేసేందుకు బన్నీ డిసైడ్ అయిపోయాడు. మరి ఆ తర్వాత చేయబోతోన్న ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఓ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసేశాడు స్టైలిష్ స్టార్. ఈ మూవీ ద్వారా కోలీవుడ్ లో పాగా వేయాలన్నది బన్నీ టార్గెట్. అధికారికంగా ప్రారంభం కూడా జరుపుకోగా.. డీజే తర్వాత ఇదే సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు మనం.. 24 వంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా బన్నీతో ఓ సినిమాకు ఇప్పటికే కమిటయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టుల గురించి ప్రస్తుతం అంతగా మాటలు వినిపించకపోయినా.. తెర వెనక మాత్రం సన్నాహాలు స్పీడ్ గానే జరుగుతున్నాయట. కథ.. కథనం వంటివాటిని ఫైనల్ చేస్తున్నారట. లింగుస్వామి ప్రాజెక్టుకు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు విక్రమ్ కె కుమార్ ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాల్సి ఉందట.

లింగుస్వామి.. విక్రమ్ కె కుమార్.. ఈ ఇద్దరు దర్శకుల సినిమాలతో కోలీవుడ్ లో కూడా ఇమేజ్ ను పెంచుకోవాలన్నది బన్నీ టార్గెట్ అంటున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ను అల్లు అర్జున్ సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లో కూడా క్లిక్ అయితే.. సౌత్ అంతా తన మార్కెట్ విస్తృతం అవుతుందన్నది అల్లు అర్జున్ ఉద్దేశ్యంగా చెప్పచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/