విక్రమ్ తో సినిమా లేటయ్యేలా ఉందే

Thu May 17 2018 15:59:08 GMT+0530 (IST)

అదిరిపోయే డ్యాన్సులు.. అదరగొట్టే ఫైట్లతో పాటు ఒళ్లు విరుచుకుని..  నానా కష్టాలు పడి అల్లు అర్జున్ చేసిన లేటెస్ట్ సినిమా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో బన్నీ పడిన కష్టానికి గుర్తింపు వచ్చింది తప్ప కాసులు రావడం లేదు. దీంతో బన్నీ తరవాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.నా పేరు సూర్య తరవాత కె.విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి డిసైడయ్యాడు బన్నీ. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఖాళీగానే ఉన్నాడు. కానీ విక్రమే ఇంకా పూర్తిగా రెడీ అవలేదు. సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదని తెలుస్తోంది. ఇప్పటికే విక్రమ్ లాస్ట్ డైరెక్షన్ చేసిన 24.. హలో సినిమాలు రెండూ ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకున్నాయి.  ఇలాంటి టైంలో అతడిని కంగారు పెడితే సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో బన్నీ మరికాస్త టైం తీసుకోమని భరోసా ఇచ్చాడట.

ఈలోగా టైం చిక్కింది కాబట్టి దువ్వాడ జగన్నాథమ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తోనూ బన్నీ టచ్ లో ఉంటున్నాడు. డీజేపై బన్నీ - హరీష్ శంకర్ చాలానే ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో హరీష్ శంకర్ ఓ కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. విక్రమ్ సినిమా స్టార్టవలేదు కాబట్టి హరీష్ బన్నీని ఇంప్రెస్ చేసే స్టోరీ వినిపించే పనిలో పడ్డాడు.