Begin typing your search above and press return to search.

చిన్న సినిమా పెద్ద ప్రమోషన్

By:  Tupaki Desk   |   23 July 2017 5:18 AM GMT
చిన్న సినిమా పెద్ద ప్రమోషన్
X
మన తెలుగులో ఏడాదికి వస్తున్న కొన్ని వందలు సినిమాలలో ఒక 50 సినిమాలు పక్కన పెడితే మిగతావన్నీ చిన్న సినిమాలే. అటువంటి చిన్న సినిమాలుకు కొన్ని సార్లు సరైన ప్రచారం దొరకకపోవడం వలన అవి ప్రేక్షకులుకు తెలియకుండా పోతాయ్. అటువంటి చిన్న సినిమాలకు ఒక స్టార్ వచ్చి ప్రోమోట్ చేస్తే కచ్చితంగా ఆ సినిమా పై జనాలు ఫోకస్ పెడతారు. కొంతవరకు ఆ సినిమాకు మంచి ప్రచారం కూడా దక్కినట్లే. ఇలా మన తెలుగులో ఒక పెద్ద స్టార్ వచ్చి ఒక చిన్న సినిమాను ప్రోమోట్ చేసే పద్దతిని డైరెక్టర్ సుకుమార్ బాగా వాడేసుకుంటున్నాడు.

సుకుమార్ ప్రొడక్షన్లో వచ్చిన కుమారి 21f సినిమా కేవలం సుకుమార్ ప్రచారం చేయడం మూలంగానే జనాలుకు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అదే పంధా లోనే మరో సినిమాకు ప్రచారం చేస్తున్నాడు సుకుమార్. ‘దర్శకుడు’ అనే సినిమా కూడ సుకుమార్ ప్రొడక్షన్ నుండి వస్తున్నదే. అందుకని ఈ సినిమా ప్రచారం కోసం సుకుమార్ పెద్ద ప్లానే వేశాడు. కొద్ది రోజులు కిందట రామ్ చరణ్ వచ్చి ఆడియో ని విడుదల చేసి ఆ ఫంక్షన్ కు నిండుతనం తీసుకువచ్చాడు. ఇప్పుడు మరో మెగా హీరో అల్లు అర్జున్ వంతు వచ్చింది. అల్లు అర్జున్ దర్శకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిది రాబోతున్నాడట. సుక్కూ అండ్ బన్నీకి ఆర్య నుండి మంచి స్నేహం ఉంది కాబట్టి.. ఈ నెల ఆఖరు తేదిలలో జరగనున్న ఈ ఫంక్షన్ కు అల్లు అర్జున్ వచ్చి సందడి చేయనున్నాడు.

వచ్చే నెల ఆగష్టు 4 న దర్శకుడు సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో హీరోగా సుక్కూ అన్న కొడుకు అశోక్.. హీరోయిన్ గా ఈషా నటిస్తున్నారు. జక్క హరి ప్రసాద్ దర్శకుడుకి దర్శకుడు. ప్రచారం ఎలా ఉన్న సినిమా ప్రేక్షకులుకు మెప్పిస్తుందో లేదో చూడాలి మరి.