Begin typing your search above and press return to search.

నీ సక్సెస్‌ ని ఎంజాయ్‌ చేసేవాళ్లలో నేనొకడిని!

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:52 AM GMT
నీ సక్సెస్‌ ని ఎంజాయ్‌ చేసేవాళ్లలో నేనొకడిని!
X
రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'టాక్సీవాలా'. నవంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్నే జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. విజయ్ ని సెల్ఫ్ మేడ్ పర్సన్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా ఈవెంట్ కు ఎలా వచ్చాడో చెబుతూ "సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంది. మళ్ళీ విజయ్ ఫంక్షన్ కి వస్తారా?" అని ఎస్కేఎన్ అడిగాడు.. ఇష్టమైనవాళ్ల కోసం చేసేది ఏదీ ఇబ్బంది కలిగించదు. దీన్ని విజయ్‌ స్టైల్‌ లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌ కొట్టదు" అన్నాడు.

విజయ్ దగ్గర ఒరిజినాలిటీ ఉందని చెబుతూ అల్లు అర్జున్ "మేం అందరం ఒక రొటీన్లో స్టక్‌ అయిపోయాం. నువ్వు అందులో లేవు. కొత్తగా ట్రై చేస్తున్నావు. ఆ తీరు జనాలకు నచ్చింది. విజయ్‌ మంచి నటుడు. మేం గోల్డెన్‌ ప్లేట్‌. నా లాంచ్‌ రాఘవేంద్రరావుగారు.. అశ్వనీదత్‌ గార్లు చేశారు. కానీ విజయ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. 'పెళ్లి చూపులు'.. ఇలా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ సొంతంగా వచ్చాడు. సెల్ఫ్‌ మేడ్‌ పర్సన్‌. నేనెంత పెద్ద నటుడిని అయినా సెల్ఫ్‌ మేడ్‌ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్‌" అన్నాడు.

విజయ్ మీద ఉన్న నెగెటివిటీ గురించి మాట్లాడుతూ "నేనెప్పుడూ టాలెంట్‌ ఉన్నోడి మీద జోక్‌ లు వేయలేను. ఈ మధ్య విజయ్‌ మీద కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సడెన్‌ గా స్టార్‌ అయితే నెగెటివ్‌ ఫోర్స్‌ కూడా ఉంటుంది. అవేవీ పట్టించుకోవద్దు విజయ్‌. అవన్నీ దాటి హిట్స్‌ కొడతావనే నమ్మకం నాకుంది. నాకంటే పెద్ద స్టార్‌ అయినా కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నీ సక్సెస్‌ ని ఎంజాయ్‌ చేసేవాళ్లలో నేనొకడిని అని నమ్ము." అన్నాడు.

ఇక పైరసీ చేయడం చాలా తప్పు అని అందరికీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని.. పేపర్లో నాలుగో పేజీ వార్తేనని కానీ అది తమకు జీవితం అని అన్నాడు. "అందరినీ గౌరవిస్తారు.. మరి సినిమా సినిమావాళ్ళకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి" అని ఆడియన్స్ ను కోరాడు.

మరోవైపు విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెబుతూ "బన్నీ అన్న 'అర్జున్ రెడ్డి' చూసిన తర్వాత పిలిపించి 20 నిముషాలు మాట్లాడారు. 'గీత గోవిందం' రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. థ్యాంక్స్‌ అన్న. బన్నీ అన్నలా నేను డ్యాన్స్‌ ఈ జన్మలో చేయలేను. ఇండస్ట్రీకి బయట వ్యక్తిని నేను. అవుట్‌ సైడర్స్‌ నన్ను ఎక్కువ ఓన్‌ చేసుకోవడానికి కారణం అదే. మనలో ఒక్కడు సక్సెస్‌ సాధించినా మనవాడు కొట్టాడు అని సంతోషపడతారు. అందుకే చాలా మంది నాకు ఇంత ప్రేమని ఇస్తున్నారని అనుకుంటున్నాను" అన్నాడు.