Begin typing your search above and press return to search.

అసలు బన్నీ ఏం పాడుతున్నాడంటే..

By:  Tupaki Desk   |   13 Feb 2016 4:15 AM GMT
అసలు బన్నీ ఏం పాడుతున్నాడంటే..
X
ఆరేళ్ల క్రితం తన మ్యారేజ్ సమయంలో అల్లు అర్జున్ ఓ సారి మైక్ పట్టుకున్నాడు. భార్య స్నేహారెడ్డిని ఇంప్రెస్ చేయడానికి తన గాన మాధుర్యాన్ని వినిపించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం చిత్రంలోని ఓ పాట కోసం కొన్ని లైన్లు పాడాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సరైనోడు చిత్రం కోసం బన్నీ పాట పాడేస్తున్నాడు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సరైనోడులో బన్నీ పాడిన పాటను రీసెంట్ గా రికార్డింగ్ కంప్లీట్ చేశారు. చెన్నైలోని స్టూడియోలో దీని రికార్డింగ్ పూర్తయిందని చెప్పాడు థమన్. అయితే.. ఈ పాట సింపుల్ ఏమీ కాదంట. ఫుల్ ఎనర్జీ ఉండే ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ థీమ్ తో కంపోజ్ చేసిన పాట కోసం బన్నీ పాడాడని అంటున్నారు. హై ఓల్టేజ్ మ్యూజిక్ ఉండే ఈ పాటలో బన్నీ ఒక్కడే కాదు.. ఎంసీ విక్కీ, ఎంఎం మానసి వాయిస్ లు కూడా వినిపిస్తాయట. అంతే కాదు.. తమన్ కూడా కొన్ని బిట్స్ పాడానని చెబుతున్నాడు.

'ఓ స్టోరీని చెప్పడానికి పాటలు ఎంత ముఖ్యమో అల్లు అర్జున్ కి తెలుసు. అందుకే ఈ సాంగ్ పాడాల్సిందిగా నేను అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. బన్నీ చాలా స్పీడ్ గా ఈ రికార్డింగ్ కంప్లీట్ చేసేయడం విశేషం. ' అని చెప్పాడు తమన్. సరైనోడు చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ పాట రకుల్ తోనే ఉంటుందని తెలుస్తోంది. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు.. సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది.