Begin typing your search above and press return to search.

అక్కడ బన్నీ సినిమానే నెంబర్ వన్

By:  Tupaki Desk   |   28 May 2016 1:30 PM GMT
అక్కడ బన్నీ సినిమానే నెంబర్ వన్
X
అల్లు అర్జున్ టైం మామూలుగా లేదిప్పుడు. అతడి లేటెస్ట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళలో కూడా ప్రకంపనలు రేపుతోంది. తెలుగులో వచ్చిన నెల రోజుల తర్వాత నిన్నే కేరళలో ‘యోధవు’ పేరుతో విడుదలైన ఈ సినిమా బంపర్ ఓపెనింగ్స్ సాధించింది. కేరళ వ్యాప్తంగా 80 సెంటర్లలో రిలీజైన ‘యోధవు’ తొలి రోజు రూ.80 లక్షల దాకా షేర్ కలెక్ట్ చేసినట్లు అంచనా.

పోటీగా విడుదలైన రెండు పేరున్న మలయాళ సినిమాల్ని వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచి ‘యోధవు’ సంచలనం రేపింది. కుంచుకోబోబన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘స్కూల్ బస్’.. ఉన్ని ముకుందర్ (జనతా గ్యారేజ్ లో నటిస్తున్నాడు) కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఒరు మురై వందు పార్తయా’ కూడా ‘యోధవు’తో పాటుగా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఐతే ‘యోధవు’ మీద ఉన్నంత హైప్.. ఆ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందున్నంత హంగామా వాటికి లేదు.

కలెక్షన్లు కూడా వాటి కంటే బన్నీ సినిమాకే ఎక్కువొచ్చాయి. ప్రముఖ సౌత్ ఇండియన్ ట్రేడ్ అనలిస్ట్ అండ్ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై స్వయంగా ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. స్టైలిస్ స్టార్ మలయాళ ఫ్యాన్స్ నిన్న ‘యోధవు’ విడుదలను ఓ పండగలాగా చేసుకున్నారు. బన్నీ ఫ్లెక్సీలకు పూలమాలలేసి.. పాలాభిషేకాలు చేసి.. థియేటర్లలో చాలా హంగామా చేసి.. మనోడికి అక్కడ పెరుగుతున్న ఫాలోయింగ్ ను చాటిచెప్పారు. మలయాళంలో ‘యోధవు’ బన్నీకి బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.