Begin typing your search above and press return to search.

బోయపాటి మార్కు..బన్నీ స్టామినా ఎంత అంటే?

By:  Tupaki Desk   |   31 May 2016 4:31 AM GMT
బోయపాటి మార్కు..బన్నీ స్టామినా ఎంత అంటే?
X
సరైనోడు అప్పుడే 40 రోజులు పూర్తి చేసుకుంది. డివైడ్ టాక్ తోనే.. ఈ సమ్మర్ లో హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన మూవీగా సరైనోడు నిరూపించాడు. బోయపాటి మార్కు.. అల్లు అర్జున్ స్టామినాతో ఇప్పుడు.. కలెక్షన్ల సునామీ సృష్టించింది సరైనోడు మూవీ. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ షేర్ వసూలు చేసి మూవీగా రికార్డులకెక్కింది. అంతేనా.. ఇటీవలే మాలీవుడ్లో విడుదలై.. బాహుబలి కంటే.. నేనే గొప్ప అని బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించాడు సరైనోడు.

ఆదివారం వరకు సరైనోడు కలెక్షన్లను ఓసారి చూస్తే.. బన్ని.. మరోసారి ఇంత కలెక్షన్లను రాబట్టగలడా అనిపిస్తోంది. రేసుగుర్రంతో కేవలం రూ.60 కోట్ల వరకే పరిమితమైన బన్నీ.. సరైనోడుతో మాత్రం.. వందకోట్ల షేర్ ను వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే నలభై రోజులు పూర్తయింది సరైనోడు విడుదలై. ఇప్పటి వరకు దాదాపు రూ.90 కోట్ల వరకూ షేర్ సాధించి... తన తోటి యంగ్ హీరోలకు సవాలు విసురుతున్నాడు బన్ని

ఓసారి కలెక్షన్ల వివరాలను చూస్తే.. నైజాం.. రూ.19.3 కోట్లు.. సీడెడ్ రూ.11 కోట్లు.. వైజాగ్ రూ.8 కోట్లు.. గుంటూరు రూ.5.3 కోట్లు.. ఈస్ట్ రూ.5.15 కోట్లు.. వెస్ట్ రూ.4.4 కోట్లు.. కృష్ణ రూ.4.05 కోట్లు... నెల్లూర్ రూ.2.29 కోట్లు.. ఓవర్సీస్ రూ.5.15 కోట్లు... రెస్టాఫ్ ఇండియా రూ.1.6కోట్లు.. కర్ణాటక రూ.8 కోట్లు... ఇక మాలీవుడ్లో మూడు రోజులకు రూ.2.4కోట్లు.. సాటిలైట్ తెలుగు.. హిందీ కలిసి రూ.16కోట్లు.. మొత్తం రూ.90 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చింది ‘సరైనోడు’ మూవీ. ఇలాగే బాక్సాఫీస్ వసూళ్లు కొనసాగితే.. భవిష్యత్తులో రూ.100 కోట్ల షేర్ ను సాధించడం పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు. చూద్దాం ఏం జరుగుతుందో?