Begin typing your search above and press return to search.

పవన్ రికార్డులకి బన్నీ గురి పెట్టాడు

By:  Tupaki Desk   |   31 May 2016 7:30 AM GMT
పవన్ రికార్డులకి బన్నీ గురి పెట్టాడు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు.. ఇప్పటికీ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. మూవీ విడుదలయ్యి 40 రోజులు గడిచినా.. బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటికే ఇండస్ట్రీ టాప్ 5లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం.. మరోసారి పవన్ రికార్డుకు గురిపెట్టేసింది.

సరైనోడు చిత్రం ఇండస్ట్రీ టాప్ 5 కి రావడానికి.. గబ్బర్ సింగ్ ను ఆరో స్థానంలోకి నెట్టేసింది. అలా టాప్ రికార్డుల్లోకి ఎంటర్ అయిన సరైనోడు.. ఇప్పుడు అత్తారింటికి దారేది చిత్రంపై కన్నేశాడు. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో బాహుబలి - శ్రీమంతుడు ఉండగా.. ఆ తర్వాతి ప్లేస్ లో అత్తారింటికి దారేది నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన ఈ మూవీకి 74 కోట్లకుపైగా వసూళ్లు దక్కాయి. ఇప్పుడు బన్నీ నటించిన సరైనోడు ఈ రికార్డుకు చేరువయిందని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

40 రోజుల తర్వాత కూడా బీ - సీ సెంటర్లలో సరైనోడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. పైగా ఇప్పట్లో వచ్చే మాస్ మూవీ ఏదీ లేదు. అంటే మరికొన్ని రోజుల పాటు సరైనోడి మాస్ రచ్చను ఆపే ఛాన్స్ లేదు. ఈలోగానే ఈ మూవీ ఇండస్ట్రీ టాప్ 3 ప్లేస్ ని ఆక్రమించేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే.. మగధీర - అత్తారింటికి దారేదిలను మించి సరైనోడు వసూళ్లు కొల్లగొడుతున్నాడన్న మాట.