బన్నీని ఖైదీ పట్టించేస్తాడా?

Tue Jan 10 2017 17:22:42 GMT+0530 (IST)

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడానికి వచ్చేస్తోంది. ఈ మూవీ రామ్ చరణ్ కూడా ఓ కేమియో చేసిన సంగతి ఇప్పటికే తెలిసిందే. మెగాస్టార్ తో కలిసి ఓ 30 సెకన్ల పాటు డ్యాన్స్ వేశానని.. ఆయన్ని చూస్తూ డ్యాన్స్ వేయడం చాలా కష్టమైపోయిందని కూడా చెప్పాడు చెర్రీ.

అయితే.. మెగాస్టార్ కు ఇది 150వ చిత్రంగా ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో.. ఈ సినిమాలో భాగం అవ్వాలని అల్లు అర్జున్ స్వయంగా కోరాడట. ఎలాగైనా సరే.. తనకు ఓ పాత్ర ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడట. ఇప్పటికే బన్నీ కేమియో ఈ మూవీలో కన్ఫాం కాగా.. ఇప్పుడు సినిమా ప్రారంభంలో వచ్చే ఓ కీలక పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఆ ఒక్క హింట్ పట్టుకుని.. బన్నీ చేయబోయే రోల్ ఏంటో ఊహించేస్తున్నారు అభిమానులు.

సినిమా ప్రారంభంలో జైల్ సీన్ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి జైల్లోంచి తప్పించుకుంటే.. అతన్ని పట్టించేందుకు చిరు హెల్ప్ తీసుకుంటారు పోలీసులు. అలా పారిపోయే వ్యక్తిగా బన్నీ నటిస్తే.. అతన్ని పట్టించే బాధ్యత చిరంజీవి హ్యాండిల్ చేస్తాడన్నది లేటెస్ట్ టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. తెల్లారే వరకూ ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/