Begin typing your search above and press return to search.

నో పాలిటిక్స్ అంటున్న బన్నీ!

By:  Tupaki Desk   |   17 Aug 2018 8:11 AM GMT
నో పాలిటిక్స్ అంటున్న బన్నీ!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' సినిమా తర్వాత ఇంతవరకూ తన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. విక్రమ్ కుమార్ కుమార్ పేరు వినిపించినా అది ఫైనల్ కాలేదు. దీంతో దిల్ రాజు తన దగ్గర ఉన్న 'సభకు నమస్కారం' స్క్రిప్ట్ ను బన్నీ వద్దకు పంపాడట. ఆ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసిన రైటర్ బన్నీ కి కథ వినిపించడం అనే తంతు పూర్తయినా గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదట.

ఆ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టొరీ తనకు సూట్ అవదని అల్లు అర్జున్ 'సభకు నమస్కారం' కు 'నో' చెప్పాడట. ఈ సినిమా మొదట నాని కోసం అనుకున్నది. కానీ నాని రిజెక్ట్ చేయడంతో రాజు గారు వేరే హీరో కోసం చూస్తున్నారు. ఎలాగూ అల్లు అర్జున్ కు ఇంకా సినిమా సెట్ కాలేదు కదా..ఒక వేళ ఇది నచ్చే అవకాశం ఉందేమో.. అలా నచ్చితే స్టైలిష్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు స్టొరీ కి మార్పులు చేర్పులు చేయవచ్చని అనుకున్నారట. కానీ అది కుదరలేదు.

ఇదిలా ఉంటే 'శ్రీనివాస కళ్యాణం' విషయంలో రాజు గారి జడ్జిమెంట్ మిస్ కావడం ఆడియన్స్ నే కాదు.. సెలబ్రిటీస్ ని కూడా కాస్త షాక్ కు గురిచేసిందట. గతంలో లాగా రాజు గారి సినిమా అంటే కళ్ళు మూసుకొని ఒకే చేసే పరిస్థితి ఇప్పుడు లేదని అందుకే బన్నీ 'సభకు నమస్కారం' పెట్టన్నాడు అని ఓ ఆఫ్ లైన్ డిస్కషన్ కూడా నడుస్తోంది.