Begin typing your search above and press return to search.

ఆ గొడ‌వ‌ల్లో ఓపిక ప‌ట్టిన ఫ‌లితం!

By:  Tupaki Desk   |   24 Jan 2019 8:35 AM GMT
ఆ గొడ‌వ‌ల్లో ఓపిక ప‌ట్టిన ఫ‌లితం!
X
ఓ సినిమా భారీ హైప్ న‌డుమ భారీ బిజినెస్ చేసి రిలీజ‌య్యాక ఫ్లాప్ అన్న టాక్ వినిపిస్తే ఇంకేమైనా ఉందా? బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు అంతా గ‌గ్గోలు పెట్టేస్తారు. న‌ష్టాల్ని రిక‌వ‌రీ చేయాలంటూ గొడ‌వ చేసేస్తారు. కొంద‌రైతే మీడియా ముందు అల్ల‌రికి దిగుతారు. ఆ స‌న్నివేశాన్ని బాస్ అల్లు అర‌వింద్ లాంటి వాళ్లు అయితే తెలివిగా డీల్ చేస్తారు. గొడ‌వ స‌ద్ధుమ‌ణిగేందుకు ఆస్కారం లేకుండా చేస్తారు. న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు కొంత మొత్తాల్ని వెన‌క్కి ఇవ్వ‌డం ద్వారా బ‌య్య‌రులో విప్ల‌వం రాకుండా ఆపేస్తారు.

ఇటీవ‌ల ప‌లు బాలీవుడ్ సినిమాల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. 2018లో ఖాన్ లు న‌టించిన సినిమాల‌కే న‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కొంత వెన‌క్కి ఇచ్చి స‌ర్ధి చెప్పారు. ర‌ణ‌బీర్ క‌పూర్ సైతం ఇదే ప‌ని చేశాడు. అయితే అదే ఏడాది అల్లు అర్జున్ న‌టించిన `నా పేరు సూర్య‌` సైతం అంతే పెద్ద డిజాస్టరై డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు కొని తెచ్చింది. దీంతో బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో క‌ల‌క‌లం మొద‌లై అది గొడ‌వ‌ల‌కు దారి తీసిందిట‌. ఈ సంగ‌తిని అల్లు అర్జున్ స్వ‌యంగా తెలిపారు. `నా పేరు సూర్య` ఫ్లాప‌య్యాక గొడ‌వ‌ల‌య్యాయ‌ని `ల‌వ‌ర్స్ డే` ఆడియో వేదిక‌పై బ‌న్ని అన్నారు. అయితే ఎన్ని గొడ‌వ‌లైనా అందులో డిస్ట్రిబ్యూట‌ర్ వినోద్ రెడ్డి మాత్రం త‌మ‌పై గొడ‌వ‌కు దిగ‌లేద‌ని రిలీజ్ ముందు ఎలా ఉన్నాడో, రిలీజ్ త‌ర్వాత ఆయ‌న అలానే ఉన్నార‌ని బ‌న్నివాసు త‌న‌తో అన్న‌ట్టుగా బ‌న్ని చెప్పుకొచ్చారు.

అయితే దానికి ప్ర‌తిగా వినోద్ కి సాయం చేసేందుకు బ‌న్ని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతం వినోద్ రెడ్డి `ల‌వ‌ర్స్ డే` (ఒరు ఆడార్ ల‌వ్ డ‌బ్బింగ్) అనే డ‌బ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అందుకే చిన్న సినిమా అయినా ప్ర‌మోష‌న్ కి అడ‌గ్గానే బ‌న్ని సాయం చేశారు. ల‌వ‌ర్స్ డే చిత్రం పెద్ద విజ‌యం సాధించాల‌ని టీమ్ ని బ్లెస్ చేశారు. దీనిని బ‌ట్టి పంపిణీదారులు న‌ష్టాలొచ్చినా డీసెన్సీ మెయింటెయిన్ చేస్తే, ఆ త‌ర్వాత హీరోలు - నిర్మాత‌ల నుంచి మ‌రిన్ని అవ‌కాశాలుంటాయ‌ని బ‌న్ని ఈ వేదిక సాక్షిగా చెప్ప‌క‌నే చెప్పాడ‌న్న‌మాట‌!! విలువ‌లు + గుడ్ క‌ల్చ‌ర్ = మంచిత‌నం అని మా బాగానే చెప్పాడు.