Begin typing your search above and press return to search.

బన్నీ స్పీచులు బాగా నేర్చాడబ్బా

By:  Tupaki Desk   |   16 July 2018 8:30 AM GMT
బన్నీ స్పీచులు బాగా నేర్చాడబ్బా
X
అల్లు అర్జున్ స్పీచులివ్వడంలో రాటుదేలుతున్నాడు. ఒకప్పుడు వేదికెక్కి మాట్లాడటానికి బాగా మొహమాట పడిన బన్నీలో ఈ మధ్య బాగా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రసంగాల విషయంలో బాగా ప్రిపేరై వస్తున్నాడు. చక్కటి స్పీచులతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ సినిమా విజయోత్సవంలో బన్నీ స్పీచ్ అదరగొట్టేశాడు. స్పీచ్ సుదీర్ఘంగా సాగినప్పటికీ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది.

నెగెటివ్ టాక్ తో మొలదై.. పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాకు విజయోత్సవం ఏంటనే ప్రశ్న జనాల్లో ఉంది. బన్నీ పరోక్షంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. తనకు నచ్చింది కాబట్టి ఈ సినిమా విజయోత్సవానికి వచ్చినట్లు చెప్పాడు. తనకు నచ్చని సినిమా గురించి తాను మాట్లాడనని.. ‘విజేత’ నచ్చడంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నానని బన్నీ అన్నాడు. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన మీద తన ప్రేమను చూపించడానికే ఈ వేడుకకు వచ్చానని కూడా బన్నీ చెప్పాడు. కళ్యాణ్ ను ‘మా అల్లుడు గారు’ అంటూ సంబోధించిన బన్నీ.. చిరంజీవికి అల్లుడైతే తమ కుటుంబం మొత్తానికి అ్లలుడే అన్నాడు.

కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని.. అతను తమ కుటుంబంలో చాలా స్పెషల్ అని బన్నీ అన్నాడు. ఈ చిత్రంలో తనకు కళ్యాణ్ కనిపించలేదని.. ఒక తండ్రికి కొడుకుగా మాత్రమే కనిపించాడని.. అతను ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నటించాడని అన్నాడు. మిగతా ఏ సీన్లయినా మేనేజ్ చేయొచ్చు కానీ.. ఎమోషనల్ సీన్లు కష్టమని.. ఈ విషయంలో కళ్యాణ్ ఆకట్టుకున్నాడని చెప్పాడు. తండ్రి పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా చేశాడని.. ఆయన్ని తాను ‘అతిథి’ రోజుల నుంచి గమనిస్తున్నానని అన్నాడు. సాయి కొర్రపాటి మంచి అభిరుచి ఉన్న నిర్మాత అని.. మంచి కథ కుదిరితే ఆయన బేనర్లో తాను సినిమా చేస్తానని చెప్పాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం చాలా బాగుందని.. చికెన్ పాట.. మిన్సారే పాట తనకు నచ్చాయని.. ‘అర్జున్ రెడ్డి’కి అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ తనకెంతో నచ్చిందని బన్నీ తెలిపాడు.