Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ గురించి బన్నీ అలా చెప్పాడు

By:  Tupaki Desk   |   9 Oct 2015 5:30 AM GMT
బాలీవుడ్‌ గురించి బన్నీ అలా చెప్పాడు
X
బాలీవుడ్ డ్రీమ్స్.. సౌత్ హీరోల్లో చాలామంది బాలీవుడ్ లో పాగా వేసేసి బాగా సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. కనీసం కలలు కంటుంటారు. అయితే నిజంగా సక్సెస్ అయినవాళ్లను కౌంట్ చేయడానికి.. ఓ చేతి వేళ్లు సరిపోతాయి. అందరూ తలబొప్పి కట్టించుకున్నోళ్లే. కానీ ఇప్పుడు బాలీవుడ్ పై కొత్త సంగతులు చెబ్తున్నాడు స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

"హిందీలో సత్తా చాటేందుకు ఎవరైనా ట్రై చేయచ్చు. కానీ అక్కడ నిలదొక్కుకోవాలంటే ముందు తెలుగును పూర్తిగా వదిలేయాలి. అక్కడ కనీసం ఐదు నుంచి పదేళ్లపాటు పోరాటం చేయాలి" అంటున్నాడు అల్లు అర్జున్. ఇలా చేయాలంటే చాలా ఓపికతో పాటు కష్టపడాలి కూడా అంటూ సెలవిచ్చాడు... వాస్తవం ఒప్పుకోవాలంటే ఇది వృధా ప్రయసగా తేల్చేశాడు. అందుకే తమలో చాలామంది బాలీవుడ్ వెళ్లేందుకు సంకోచిస్తామంటున్నాడు. అయితే ప్రస్తుతం టైం మారుతోందని.. సౌత్ మార్కెట్ ని బాలీవుడ్ బాగానే గుర్తించడంతో.. త్వరలో మల్టీ స్టారర్ ల మాదిరిగా.. హిందీ నుంచి కూడా మల్టీ లాంగ్వేజ్ సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నాడు అల్లు అర్జున్. త్వరలో అంటే ఓ మూడు నాలుగేళ్లలో ఉత్తరాది, దక్షిణాది యాక్టర్స్ కలిసి మల్టీస్టారర్స్ చేసే రోజులు వస్తాయని ఎక్స్‌ పెక్ట్ చేస్తున్నాడట.

బాలీవుడ్ గురించి బన్నీ చెప్పిన సంగతులు బాగానే ఉన్నాయి కానీ.. ఇవన్నీ బావ రామ్ చరణ్ అక్కడికి వెళ్లొచ్చాక తెలుసుకున్నాడా అన్నదే డౌట్. ముందే తెలిసుంటే.. చెర్రీ చెవిలో కూడా ఆ 'జంజీర్‌' గురించి ఓ మాట పడేయాల్సింది. ఎందుకంటే.. లేటెస్ట్ గా అక్కడికెళ్లి ప్రయాస పడి వెనక్కొచ్చింది చరణే కదా.