Begin typing your search above and press return to search.

సెలక్షన్ లో బన్నీ కేక.. అంతే

By:  Tupaki Desk   |   27 Nov 2015 10:30 PM GMT
సెలక్షన్ లో బన్నీ కేక.. అంతే
X
అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ ఓ సబ్జెక్ట్ ఫైనల్ చేస్తే.. అది సూపర్ హిట్టే అనే నమ్మకం ఇండస్ట్రీలో జనరేట్ అవుతోంది. వరుసగా బన్నీ మూవీస్ సాధిస్తున్న సైలెంట్ హిట్స్ నే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి సెలక్షన్ విషయంలో తండ్రి వారసత్వాన్ని అచ్చంగా పుణికి పుచ్చుకున్నాడు ఈ హీరో. సబ్జెక్ట్ ల విషయంలోనే కాదు.. డైరెక్టర్ల విషయంలోనూ బన్నీ ఎంపిక సూపర్ గా క్లిక్ అవుతోంది.

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం.. ముందు ఎన్టీఆర్ ని, ఆ తర్వాత మహేష్ బాబును అడిగాడు గుణశేఖర్. అయితే వారిద్దరూ ఒప్పుకోలేదు. కానీ తనే ఆ రోల్ చేస్తానంటూ ముందుకొచ్చాడు బన్నీ. ఆ రోల్ బన్నీ కెరీర్ కి ఎంతో ప్లస్ అయింది. ఆ తర్వాత బన్నీ ఫైనల్ చేసిన మరో సబ్జెక్ట్.. మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో. నిజానికి ఈ స్టోరీని కూడా ముందు మహేష్ బాబునే అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ బన్నీ చేతికి వచ్చింది. ప్రస్తుతం బోయపాటితో యాక్షన్ పాక్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. దాని తర్వాత క్లాస్ టచ్ ఉన్న డైరెక్టర్ తో చేయబోతున్నాడన్న మాట. ఇది ప్రారంభం కాబోయే సినిమాల సంగతి కాగా.. ఇప్పటికే ఈ తరహా సెలక్షన్ తో మెస్మరైజ్ చేశాడు బన్నీ.

సురేందర్ రెడ్డితో సినిమాకి ఇండస్ట్రీలో అందరు హీరోలు వెనకడుగు వేస్తున్న సమయంలో.. అతడితో రేసుగుర్రం చేశాడు బన్నీ. ఇది స్టైలిష్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా డైరెక్టర్ల ఎంపికలో నావెల్టీ చూపిస్తూ.. తన స్థాయిని సినిమా సినిమాకి పెంచేసుకుంటుంన్నాడు బన్నీ. ఇంతగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా.. ఇప్పటికి ఇండస్ట్రీలో ఉన్న డౌట్ ఏంటంటే.. బోయపాటితో మూవీ చేయాలన్న బన్నీ ఆలోచన సరైనదేనా అని.. మరి సరైనోడు రిజల్ట్ ను బట్టి.. ఈ విషయం ఆధారపడి ఉంది.