Begin typing your search above and press return to search.

బన్నీ ఇంకా తేల్చుకోలేదా?

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:30 PM GMT
బన్నీ ఇంకా తేల్చుకోలేదా?
X
ఒకప్పడు స్టార్ హీరోలందరూ సినిమాకు సినిమాకు బాగా గ్యాప్ తీసుకునేవాళ్లు. పెద్ద సినిమాల చిత్రీకరణ కూడా ఎక్కువ రోజులు సాగేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఒక సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. ఇంకో సినిమాను ఓకే చేసి ఇది పూర్తి కాగానే అది మొదలుపెట్టేస్తున్నారు. దాదాపు అందరు హీరోల్లోనూ ఈ మార్పు కనిపిస్తుండగా.. ఒక్క అల్లు అర్జున్ మాత్రం పాత స్టయిల్లోనే సాగిపోతున్నాడు. ఒక సినిమా పూర్తయిన వెంటనే బన్నీ ఇంకో సినిమా మొదలుపెట్టడు. తాను ఖాళీ అయ్యాక తన టీంతో స్క్రిప్టు సంగతేంటో చూసి అంతా పక్కాగా రెడీ అయ్యాక కానీ సినిమా మొదలుపెట్టడతను. అందులోనూ ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ అయ్యేసరికి బన్నీలో ఈ అప్రమత్తత మరింత పెరిగినట్లుంది.

ఈ సినిమా విడుదలయ్యే సమయానికే దాదాపు ఓకే అనుకున్న విక్రమ్ కుమార్ సినిమాను బన్నీ ఇంకా మొదలుపెట్టలేదు. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టి తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో బన్నీ ఒక పట్టాన రాజీ పడట్లేదని సమాచారం. విక్రమ్ చెప్పిన కథ చాలా వరకు ఓకే అయినప్పటికీ ఫైనల్ వెర్షన్ విషయంలో సంతృప్తిగా లేని బన్నీ దాన్ని హోల్డ్ లో పెట్టేశాడు. ఇది వీలు కాని పక్షంలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. సురేందర్ రెడ్డిల్లో ఒకరితో పని చేద్దామని కూడా బన్నీ యోచిస్తన్నట్లు తెలుస్తోంది. కానీ ఏదీ కూడా ఖరారవ్వలేదు. అల్లు అరవింద్ ఇటీవలే మీడియాతో మాట్లాడినపుడు అన్నీ కలిసొస్తే అక్టోబర్లో బన్నీ కొత్త సినిమా మొదలవుతుందన్నాడు. కానీ అది కూడా పక్కా ఏమీ కాదు. ఏదైనా కూడా బన్నీకి పూర్తి సంతృప్తినిచ్చే స్క్రిప్టు దొరకడం ముఖ్యం. మరి బన్నీని ఎవరు సంతృప్తి పరుస్తారో?