బన్నీ సాంగ్ లీకైంది.. తీసేశారు!!

Tue Feb 13 2018 22:31:59 GMT+0530 (IST)

ఒక్కోసారి అంతే.. అన్నీ రెడీ ఉన్నాసరే మనోళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అయితే రిలీజ్ అవ్వబోయే అల్లు అర్జున్ కొత్తపాట ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయింది. మనోళ్ళు వేలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేద్దాం అని కాచుక్కుచ్చున్నారు. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్టేంటంటే.. విశాల్-శేఖర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ముందే రిలీజ్ అయిపోయింది. అంటే.. అనుకోకుండా లీకైంది. ఎలాగైందో చూద్దాం పదండి.నిజానికి ఈ సాంగును వినాలని చాలామంది ఔత్సాహికులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇకపోతే సినిమా ప్రొడక్షన్ వర్గాలు కూడా.. ఆదిత్య మ్యూజిక్ వారి అఫీషియల్ యుట్యూబ్ ఛానల్లో లిరికల్ సాంగును అప్ లోడ్ చేసి.. దాని ప్రైవేట్ లింకును చాలామందికి షేర్ చేశారట. అలా కొంతమంది మీడియా వాళ్లకు కూడా అది చిక్కింది. అయితే ఎప్పుడెప్పుడు ట్విట్టర్లో ఎవ్వరికీ తెలియని ఒక అప్డేట్ పోస్టు చేసి.. యమ్మటనే ఫాలోవర్లను ఇంప్రెస్ చేసేద్దాం అని పడిగాపులుగాసే కొందరు ప్రబుధ్దులు.. ఆపుకోలేక ఆ లింకును షేర్ చేసిపాడేశారు. దానితో ఓ గంట పాటు టాలీవుడ్ అంతా కూడా.. 'లవ్వర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో' అంటూ సదరు పాటతో మార్మోగిపోయింది. పాట కాస్త కొత్తగా డిఫరెంటుగానే ఉన్నా కూడా.. ఇలా లీకైతే ఎలా సామీ? లీక్ చేస్తే ఎలా సామీ?

అందుకే కాస్త లేటుగా తేరుకున్న బన్నీ అండ్ కో.. వెంటనే ఆదిత్య మ్యూజిక్ యుట్యూబ్ ఛానల్ నుండి సదరు పాటను తీసేయించారు. అయితే వాళ్ళు తీసేసేపాటికి ఓ నాలుగు వేల మంది షుమారుగా ఈ పాటను వీక్షించేశారు కూడా. అదేలేండి.. లిరికల్ వీడియోను వినేశారు. అది సంగతి.