Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కేపిటల్ లో బన్నీకి సొంతిల్లు

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:59 AM GMT
బాలీవుడ్ కేపిటల్ లో బన్నీకి సొంతిల్లు
X
బన్నీ ముంబైలో ఫ్లాట్ కొనేశాడు. హై లొకాలిటీ లో పోష్ ఏరియా ఒకటి చూసుకుని.. టూబెడ్ రూం ఫ్లాట్ తీసుకున్నాడు అల్లు అర్జున్. మనోడికి బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్సే ఉన్నాయి. వాళ్లతో రిలేషన్ మెయింటెయిన్ చెయ్యడం కోసం.. ముంబైలో సొంత ఇల్లు ఏర్పాటు చేసేసుకున్నాడు. అంతేకాదు దీనికి సంబంధించిన ఇంటీరియర్ మొత్తం తనే డిజైన్ చేసుకున్నాడు కూడా.

బాలీవుడ్ లో అడుగుపెట్టడంపై బన్నీ ఇంకా ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు కానీ... ఇప్పటికైతే ఇల్లుమాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటీరియర్ వర్కర్స్ సహాయంతో ఫ్లాట్ లో ప్రతీ వస్తువు తన టేస్ట్ కు తగ్గట్లుగా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా చెప్పడమే కాదు.. ఆ ఫ్లాట్ ఫోటోలు కూడా షేర్ చేయడం విశేషం. ఇప్పటికే రామ్ చరణ్, దగ్గుబాటి రాణాలు ఇలా ముంబైలో సొంతిల్లు తీసుకుని, బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. కూడా. వాళ్లు అక్కడ ఎంట్రీ ఇచ్చాక ఇలా ఫ్లాట్ కొన్నారు. కానీ.. మన దేశముదురు మాత్రం ముందు సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, డిజైనర్ అవతారం కూడా ఎత్తేశాడు.

బాలీవుడ్ లో గౌరీఖాన్, సుజానే రోషన్ లు ఇలా మొదలుపెట్టే చివరికి సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేశారు. అసలే అనేక విషయాల్లో ప్రొఫెషనల్ గా ఉండే బన్నీ కూడా.. ఈ ఛేంజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.