Begin typing your search above and press return to search.

బన్నీ భలే క్యుట్ గా ఉన్నాడే!

By:  Tupaki Desk   |   11 Jun 2019 4:51 AM GMT
బన్నీ భలే క్యుట్ గా ఉన్నాడే!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఊపందుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా సెట్ లో నుంచి లీకైన ఒక స్టిల్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది. చాలా డీసెంట్ గా ఒద్దికైన హెయిర్ స్టైల్ తో ప్లెయిన్ డ్రెస్సింగ్ తో కాలికి చెప్పులు లేకుండా మెడలో ఐడి కార్డుతో సింపుల్ గా నడిచి వస్తున్న బన్నీని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.

దీనికన్నా ముందు జుట్టుని పెంచి కొంత డిఫరెంట్ గా కనిపించిన బన్నీ మళ్ళి కూల్ లుక్స్ లోకి వచ్చేశాడు. నా పేరు సూర్య కోసం ట్రై చేసిన మిలిటరీ కట్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఇప్పుడు దీంతో తన ఓల్డ్ స్కూల్ కు వచ్చేశాడు బన్నీ. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో టబు-జయరాం హీరో తల్లితండ్రులుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫామిలీ సెంటిమెంట్స్ తో ఎమోషన్ ప్లస్ యాక్షన్ అన్ని కలగలసి హ్యాట్రిక్ హిట్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్.

నవదీప్ - సుశాంత్ లాంటి యాక్టర్స్ తో ఇప్పటికే స్టార్ క్యాస్ట్ కళకళలాడుతుండగా ఇటీవలే నివేత పేతురాజ్ జాయిన్ కావడం ఇంకో ప్లస్ అవుతోంది. మొత్తానికి క్యాస్టింగ్ తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. సైరా తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు. టైటిల్ కూడా అప్పటిదాకా ప్రకటించే అవకాశం లేనట్టే. ఇప్పటికే నేను నాన్న-అలకానంద అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాని యూనిట్ వాటిని కొట్టిపారేస్తోంది