Begin typing your search above and press return to search.

ఇమేజ్ మేకోవర్ కు బన్నీ సిద్ధం!

By:  Tupaki Desk   |   18 Aug 2018 11:10 AM GMT
ఇమేజ్ మేకోవర్ కు బన్నీ సిద్ధం!
X
ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఎన్నడూ లేనంత సఖ్యత కనిపిస్తోంది. ఒకరి సినిమాను మరొకరు అభినందించడం - ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదిక పంచుకోవడం - కలిసి పార్టీలు చేసుకోవడం కామన్ అయిపోయాయి. ముఖ్యంగా ఇలా కలివిడిగా ఉండేవాళ్ళలో రామ్ చరణ్- ఎన్టీఆర్ - మహేష్ బాబు ల పేర్లు చెప్పుకోవాలి. ఇప్పటికే చరణ్-ఎన్టీఆర్ - మహేష్ లు కలిసి ఎంజాయ్ చేసే ఫోటోలు మీడియాలో చాలానే బయటకు వచ్చాయి.

కానీ ఈ లిస్టు లో ఎప్పుడూ అల్లు అర్జున్ పేరు మాత్రం వినిపించదు. దీంతో బన్నీ ఇతర హీరోలతో కలివిడిగా ఉండడనే టాక్ ఒకటి వినిపిస్తోంది. మరి ఆ ఇమేజ్ ను మార్చుకునేందుకు అల్లువారి హీరో సిద్దమయ్యాడట. తాజా సమాచారం ప్రకారం బన్నీ 'గీత గోవిందం' సక్సెస్ అయిన సందర్భంగా ఒక ఫిలిం యూనిట్ కి ఒక మంచి పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా అల్లు అరవింద్ సెకండ్ బ్యానర్ GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన విషయం తెలిసిందే. దానికితోడు, నిర్మాత బన్నీ వాస్ తనకు చాలా క్లోజ్. ఈ పార్టీకి మహేష్ బాబు ను ఇన్ వైట్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.

ఇక అంతా అనుకున్నట్టు జరిగితే స్టైలిష్ స్టార్ - సూపర్ స్టార్ - రౌడీ స్టార్ ను ఒక ఫ్రేమ్ లో చూడచ్చు. మరి బన్నీ ఇమేజ్ మేకోవర్ కు ఇదో మొదటి స్టెప్ కూడా అయ్యే అవకాశం ఉంది. అందరితో కలిసి మెలిసి ఉండాలనే ఆలోచన మంచిదే కదా.