పవన్ ని వాటేసుకున్న బన్నీ.. ఎమోషన్ పీక్స్

Fri Apr 20 2018 12:55:27 GMT+0530 (IST)

మెగా హీరోలు అంతా నిజానికి ఒకతాటిపైనే ఉండేవారు. కానీ మధ్యలో వచ్చిన విబేధాల కారణంగా.. పవన్ ఫ్యాన్స్- బన్నీ ఫ్యాన్స్ అనే సెపరేట్ సెగ్మెంట్లు కనిపించాయి. ఇది మెల్లగా చిరు ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ అనుకునే వరకూ వెళ్లిపోయింది. కానీ తామంతా ఒక్కటే అనే సందేశాన్ని మెగా ఫ్యామిలీ ఎప్పుడూ పంపుతూనే ఉంది కానీ.. వారిలో విబేధాలు ఉన్నాయనే ప్రచారమే ఎక్కువగా సాగింది.ఇప్పుడు శ్రీరెడ్డి ఉదంతం బయటకు రావడం.. దీని వెనుక సీఎం కొడుకు లెవెల్ నుంచి మీడియా మహామహులు ఉన్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. టీఆర్పీలు కావాలి కదా.. అన్ని షోలకు అమ్మను చూపిస్తా అంటూ పవన్ చెప్పగా.. ఫిలిం ఛాంబర్ కు వరుసగా మెగా హీరోలు అంతా చేరుకుంటున్నారు. నాగబాబు..పవన్ కళ్యాణ్ రాగా.. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ఆ సమయంలో ఎంతో ఎమోషన్ అయిపోయిన అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూనే మధ్యలో హగ్ చేసేసుకున్నాడు. బన్నీ చూపించిన ఈ ఎమోషన్ అందరినీ కదిలించేసింది.

అయితే.. ఇవాళ జరిగే ప్రెస్ మీట్ కు మొత్తం మెగా హీరోలు అంతా వచ్చేస్తున్నారు. ఇప్పటికే సాయిధరం తేజ్.. వరుణ్ తేజ్ కూడా ఫిలిం ఛాంబర్ కు రాగా.. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ లు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. అంటే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కలిసి తమపై జరిగిన కుట్రను ఖండించే ప్రోగ్రాం పెట్టుకున్నారన్న మాట.

మరిన్ని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి