Begin typing your search above and press return to search.

అలా నిల‌బ‌డ‌రా బావా..!

By:  Tupaki Desk   |   21 Jan 2019 11:14 AM GMT
అలా నిల‌బ‌డ‌రా బావా..!
X
బావ‌- బావ‌మ‌రుదుల ప‌రాచికం, వెట‌కారాలు ఎక్క‌డైనా ఒక్క‌టే. అది కామ‌న్ మేన్ అయినా, సెల‌బ్రిటీలు అయినా ప‌రాచికాలు జోష్ పెంచేవే కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రి. కొంటె బావ త‌గిలితే, బామ్మ‌ర్ధి కూడా చెల‌రేగిపోతాడు. కానీ ఇక్క‌డ స‌న్నివేశం వేరుగా ఉంది. ఈ కొంటె బావ చిలిపి త‌నాన్ని ఆ బావ‌మ‌రిది అస్స‌లు త‌ట్టుకోలేక‌పోతున్నాడు.

నీ అంత హైటు నేను చూడ‌రా! అంటూ క‌వ‌ర్ చేసేస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. త‌న ప‌క్క‌నే నిల‌బ‌డి ఉన్న వ‌రుణ్ తేజ్ తో మ్యాచ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఒంటెలా అంత పొడ‌వుగా ఉన్న ఆ కాళ్ల‌ను స‌రిగా ఉండాల‌ని బ‌న్ని ఎలా స‌రి చేస్తున్నాడో!! ఆ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో, యూట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆరున్న‌ర అడుగుల ఆజానుభాహుడు .. గ్రీకువీరుడిగా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ టాలీవుడ్ టాలెస్ట్ హీరోగా వెలిగిపోతున్నాడు. అత‌డిని బావ‌లు అల్లు అర్జున్, శిరీష్, సాయిధ‌ర్మ‌, వైష్ణ‌వ్ వీళ్లంతా బాగానే ఏడిపిస్తార‌ని, ఆడుకుంటార‌ని అర్థ‌మ‌వుతోంది. హైటు పేరుతో అత‌డితో బావ‌ల ప‌రాచికం బాగానే ఉంటుంద‌న్న‌మాట‌!! ముఖ్యంగా బ‌న్ని బావ అయితే మ‌రీ చిలిపి.

ఇంత‌కీ ఈ సీను ఎక్క‌డిది? అంటే .. నేడు హైద‌రాబాద్ లో వైష్ణ‌వ్ తేజ్ ఓపెనింగులో ఈ దృశ్యం క‌నిపించింది. ఒకే వ‌రుస‌లో ప‌క్క ప‌క్క‌నే నిల‌బ‌డి బ‌న్ని- వ‌రుణ్ తేజ్ చాలానే కామెడీ చేశారు. మ‌ధ్య‌లో మెగా వృక్షం హెడ్ మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఓవైపు బావ‌- బావ‌మ‌రిది మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశం క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. లైఫ్ అంటే ఫ‌న్.. ఫ‌న్ లేని లైఫ్ దండ‌గ‌! అని మా బాగానే చెప్పారు.