Begin typing your search above and press return to search.

సినిమా అంతా అదే రోల్ లోనా??

By:  Tupaki Desk   |   19 Feb 2017 4:21 AM GMT
సినిమా అంతా అదే రోల్ లోనా??
X
టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎవరూ చేయని.. చేయలేని ధైర్యం చేసేస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ ప్రీ లుక్-ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసి.. సినిమా జోనర్ ఏంటనే విషయాన్ని చెప్పేశారు. ఫస్ట్ లుక్ లో బన్నీ వెనకాల కనిపిస్తున్న ఏరియాను చూస్తే అదో అగ్రహారం అనే సంగతి తెలుస్తూనే ఉంది. అసలు ఈ సినిమాతో బన్నీ పెద్ద ధైర్యం చేస్తున్నాడని అనడానికి కారణం.. సినిమా అంతా ఇదే రోల్ లో కనిపించనున్నాడట స్టైలిష్ స్టార్.

గతంలో ఇలాంటి పాత్రలను టాలీవుడ్ ప్రేక్షకులు చూశారు. అదుర్స్ మూవీలో చారిగా అంటారు.. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో డ్యాన్స్ మాస్టర్ గా చిరంజీవి.. మైకేల్ మదనకామరాజులో కమల్ హాసన్ లు నటించారు.. మెప్పించారు. కానీ అవేమీ ఫుల్ లెంగ్త్ రోల్స్ కాదు. లీడ్ హీరో రోల్ వేరే ఉంటుంది. చిరు.. ఎన్టీఆర్.. కమల్ లు చేసిన సినిమాల్లోని బ్రాహ్మిన్ పాత్రలు అన్నీ సపోర్టింగ్ రోల్స్ మాత్రమే. కానీ బన్నీ మాత్రం ఏకంగా ఇదే పాత్రను మెయిన్ హీరోగా పెట్టి సినిమా చేసేస్తున్నాడు.

ఇన్నేళ్లు ఇలాంటి పాత్రలను కేవలం కామెడీకి మాత్రమే ఉపయోగించుకోగా.. ఇప్పుడు ఓ సాంప్రదాయ బ్రాహ్మిన్ రోల్ ను.. లీడ్ హీరోగా మార్చేశాడు బన్నీ. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాత్రపై ప్రాణం పెట్టి మరీ కేరక్టర్ డిజైన్ చేశాడట. ఈ పాత్రకు సెట్ చేసిన కేరక్టరైజేషన్ విపరీతంగా నచ్చేయడంతోనే.. సినిమా అంతా ఇలానే కనిపించే డీజే చిత్రాన్ని చేశాడట బన్నీ. మరి స్టైలిష్ స్టార్ ని ఇలాగే చూడాలా అంటే.. పాటలు ఉంటాయి కదండీ.. వాటిల్లో అల్లు అర్జున్ తన కొత్త స్టైల్స్ అన్నీ చూపించేస్తాడులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/