ఇంకెన్ని రోజులు చెక్కుతావు త్రివిక్రమా

Tue Mar 12 2019 13:32:47 GMT+0530 (IST)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎవరెవరితో సినిమాలు చేయబోతున్నాడో క్లారిటీ ఉంది కాని అసలు అవి ఎప్పుడు మొదలవుతాయో ఏ డేట్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాక బన్నీ ఫ్యాన్స్ మెదడు హీటెక్కిపోతోంది. ఇప్పటికే ఎనిమిది నెలల గ్యాప్ దాటేసింది. అదుగో ఇదుగో అనడమే తప్ప త్రివిక్రమ్ మూవీ ఇంకా స్టార్ట్ చేయనే లేదు. కాంబోకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప వెనుక ఉన్న రెండు పెద్ద నిర్మాణ సంస్థలు అంతకు మించి ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు.ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఓకే అయ్యింది కాని సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడికి అల్లు కాంపౌండ్ కి ఏకాభిప్రాయం కుదరడం లేదట. అల్లు అర్జున్ సైతం ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చిందని చెప్పినట్టు అయితే ద్వితీయార్థంలో ఈ టెంపో కంటిన్యూ అయితే బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పి ఆ మేరకు మార్పులు చేయమని కోరాడట. అందుకే అలస్యమని ఫిలిం నగర్ మాట. కారణలు ఏవైనా అభిమానులకు ఫైనల్ గా కావాల్సింది సినిమా. ఏడాదికి ఒకటో రెండో తమ హీరోని వెండితెరపై చూడాలని కోరుకుంటారు.

ఇంతేసి గ్యాప్ అంటే వాళ్ళను కన్విన్స్ చేయడం కష్టం. అయినా బన్నీ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడే సమస్యే లేదని చెబుతున్నాడట. అరవింద సమేత వీర రాఘవ సందడి తగ్గాక త్రివిక్రమ్ కు చాలా తక్కువ టైం దక్కింది. అదేదో బాలీవుడ్ రీమేక్ అనుకున్నారు కాని ఒరిజినల్ వెర్షన్ నిర్మాతతో హక్కుల విషయంలో వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఫ్రెష్ గా మరో కథను మొదలుపెట్టాల్సి వచ్చిందట. ఏది ఏమైనా ఇంకాస్త స్పీడ్ పెంచడం ఇప్పుడు చాలా అవసరం. బన్నీ బర్త్ డేకే ఓపెనింగ్ టార్గెట్ చేసినట్టు మరి కథనం