Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : మెగా వారి హోలీ వేడుకలు

By:  Tupaki Desk   |   21 March 2019 10:37 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : మెగా వారి హోలీ వేడుకలు
X
సందర్బం ఏదైనా, పండుగ ఏదైనా కూడా అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో ఈమద్య కాలంలో బాగా ఎంజాయ్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి పండుగకు కూడా ఈమద్య కాలంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ ఇటీవల సంక్రాంతికి తాతగారి ఊరుకు వెళ్లిన విషయం తెల్సిందే. తాజాగా అల్లు అర్జున్‌ ఫ్యామిలీ హోలీ వేడుక వైభవంగా జరుపుకుంది. అల్లు అర్జున్‌ - స్నేహారెడ్డితో పాటు మెగా డాటర్‌ నిహారిక కూడా జాయిన్‌ అయ్యింది.

అంతా కూడా బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌ లో హోలీ ఆడుతూ సందడి చేశారు. నిహారిక మరియు స్నేహా రెడ్డిలు హోలీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అల్లు అర్జున్‌ నిహారికపై బకీటుతో నీళ్లు గుమ్మరించడం - ఆ తర్వాత అల్లు అర్జున్‌ కు నిహారిక నీళ్లు గుమ్మరించడం - బన్నీ పిల్లలు కూడా రంగుల్లో మునిగి పోవడం వంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ పండుగల సమయంలో మరోసారి తనదైన శైలిని కనబర్చాడని చెప్పుకోవచ్చు.

ఇక మరో వైపు అల్లు అర్జున్‌ తదుపరి చిత్రంకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ను మొదలు పెట్టి సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలనేది త్రివిక్రమ్‌ ప్లాన్‌ గా తెలుస్తోంది. బన్నీ కూడా చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.