Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బీచ్ లో బన్నీ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:09 PM GMT
ఫోటో స్టోరి: బీచ్ లో బన్నీ ఫ్యామిలీ
X
మన స్టార్ హీరోలు సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో గడపకుండా అస్సలు ఉండలేరు. ఈ మధ్య కొంత మంది స్టార్ హీరోలు వారి ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలను బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్య హాలిడేస్ ట్రిప్పులు బాగానే సాగుతున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ ఫ్యామిలీ విహార యాత్రలకు ఏ రేంజ్ లో వెళుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రీసెంట్ గా తన పాప ఆర్హ మొదటి పుట్టిన రోజు సందర్భంగా బన్నీ తన ఫ్యామిలీ తో మలేషియా వెళ్లి వచ్చాడు. అక్కడే గ్రాండ్ గా బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. ఆ తర్వాత వెంటనే నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం గోవాలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే బన్నీ వెంట అతని కుటుంబ సభ్యులు కూడా వచ్చారు గోవాలోని తాజ్ యాగ్యుడా అనే హోటల్ లో ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా గడుపుతున్నారట. ఆల్రెడీ ఆ సినిమా యునిట్ షూటింగ్ ముగించుకుని వెనక్కి వచ్చేసినా.. బన్నీ మాత్రం ఫ్యామిలీతో అక్కడే ఉన్నాడట.

ఇక రీసెంట్ గా అందరు కలిసి ఒక బీచ్ కి వెళ్లి సరదాగా గడిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. ఈ హీరో ఫాలోవర్స్ బన్నీ బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ అని బిరుదులను కూడా ఇస్తున్నారు. ఇక నా పేరు సూర్య సినిమా దాదాపు ఏండింగ్ కు వచ్చేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.