Begin typing your search above and press return to search.

వైఫ్‌ తో కొండ‌ల్లో బ‌న్ని ట్రెక్కింగ్

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:33 PM GMT
వైఫ్‌ తో కొండ‌ల్లో బ‌న్ని ట్రెక్కింగ్
X
మ‌న హీరోలు ఛాన్స్ దొరికిందంటే విదేశీ విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిపోవ‌డం అక్క‌డ రిలాక్స‌యిపోయిపోవ‌డం రివాజుగా మారింది. మ‌హేష్‌ - బ‌న్ని - చ‌ర‌ణ్ ఈ విష‌యంలో చాలా స్పీడ్‌ గా ఉంటారు. కుటుంబ సమేతంగా రెజోవేష‌న్ టూర్ వెళ్లి తిరిగి ఇండియా వ‌చ్చాక మ‌ళ్లీ రెగ్యుల‌ర్ షూటింగుల్లో బిజీ అయిపోవ‌డం మ‌న హీరోల‌కు అల‌వాటుగా మారింది. మ‌హేష్ రీసెంటుగానే గోవా ట్రిప్ వెళ్లాడు. అక్క‌డ ఫ్యామిలీ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

ఇప్పుడు బ‌న్ని వంతు. నిన్న‌గాక మొన్న‌నే `గీత గోవిందం` స‌క్సెస్ సెలబ్రేష‌న్ ద‌గ్గ‌రుండి జ‌రిపించ‌డ‌మే గాక ఆ టీమ్‌ కి అదిరిపోయే పార్టీ ఇచ్చాడు బ‌న్ని. ఇంత‌లోనే అతడు వేరొక చోట ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. భార్య స్నేహారెడ్డితో క‌లిసి అత‌డు కొండ కోన‌ల్లోకి ట్రెక్కింగుకి వెళ్లాడు. త‌మ‌తో పాటే ఒక బృందం ప‌చ్చ‌ని కొండ‌ల న‌డుమ ట్రెక్కింగ్ చేయ‌డం కంట ప‌డింది. ఈ గ్యాంగ్‌లో ముగ్గురు గాళ్స్ - న‌లుగురు బోయ్స్ ఉన్నారు. అస‌లే రుతుప‌వ‌నాల రాక‌తో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వీళ్లు వెళ్లిన కొండ‌లు ఏవో కానీ అక్క‌డ ఆ ప్ర‌భావం ఉన్న‌ట్టు లేదు.

ఈ ట్రిప్ ముగించుకుని బన్ని త‌దుప‌రి న‌టించే సినిమాపై పూర్తి స్థాయిలో కాన్‌ స‌న్‌ ట్రేట్ చేస్తాడేమో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ విక్ర‌మ్.కె.కుమార్ క‌థ ఫైన‌ల్ చేశారా? లేదా? అన్న‌ది అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. విక్ర‌మ్ కంటే త్రివిక్ర‌మ్ అయితేనే బెట‌ర్ అని భావిస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. మ‌రి బ‌న్ని ఆప్ష‌న్ ఎవ‌రికో కాస్త‌ వేచి చూడాల్సిందే.