Begin typing your search above and press return to search.

దువ్వాడ.. ఒక్క లుక్ తో ఎన్ని చెప్పాడో

By:  Tupaki Desk   |   18 Feb 2017 4:30 AM GMT
దువ్వాడ.. ఒక్క లుక్ తో ఎన్ని చెప్పాడో
X

డీజే.. దువ్వాడ జగన్నాధం.. కొన్ని రోజులుగా తెగ ట్రెండింగ్ అయిపోతున్న అల్లు అర్జున్ మూవీ. ఫిబ్రవరి 18న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని డీజే యూనిట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. చెప్పినట్లుగానే ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు దువ్వాడ జగన్నాధం.

స్టైలిష్ స్టార్ ను ఇప్పటివరకూ ఎన్నడూ చూడని విభిన్నమైన స్టైల్ లో.. ఈ డీజే ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఓ పాత బజాజ్ స్కూటర్.. దానికి వెనక పక్కనా మొత్తం అంతా ఆకు కూరలు.. అరటి గెలలు తీసుకెళుతున్న అల్లు అర్జున్ ఈ పోస్టర్ లో కనిపిస్తారు. అయితే.. ముందు నుంచి అనుకున్నట్లుగానే.. తొలిసారిగా ఈ చిత్రంలో పూర్తి సాంప్రదాయ బ్రాహ్మణుడి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని చెప్పేశాడు దర్శకుడు.

బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించిన థీమ్ కూడా ఈ కంప్లీట్ బ్రాహ్మిన్ నేటివిటీని కన్ఫాం చేస్తోంది. మరోవైపు ఏపీ16 అనే రిజిస్ట్రేషన్ ఉన్న పాత స్కూటర్ ను ఉపయోగించడంతో.. బెజవాడ బేస్డ్ అనుకుందామని భావించినా.. మరీ పాత స్కూటర్ కావడంతో అక్కడి ప్రాంతాన్నే ఉపయోగించారని చెప్పడం కష్టం. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే తమ సినిమా స్టైల్ ఏంటో.. థీమ్ ఏంటో.. సింపుల్ గా చెప్పేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ దర్శకుడు హరీష్ శంకర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/