బన్నీ డీజే షూటింగ్ ఆగిపోయిందా?

Sat Feb 18 2017 00:24:04 GMT+0530 (IST)

అల్లు అర్జున్ నటిస్తున్న డీజే-దువ్వాడ జగగన్నాధం ఫస్ట్ లుక్ ఇవాళ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. లీక్ అయిన ఫోటో ద్వారా.. ఈ మూవీలో స్టైలిష్ స్టార్ కేరక్టర్ పై ఓ అంచనా కూడా ఏర్పడింది. ప్రస్తుతం కర్నాటకలో షూటింగ్ జరుపుకుంటున్న డీజేకు.. అనుకోని ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుస్తోంది.

కర్నాటకలోని బేలూర్ లో డీజే షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ గల ఓ ప్రముఖ వైష్ణవ దేవాలయంలో.. శివ లింగంతో షూటింగ్ చేస్తున్నారట దువ్వాడ జగన్నాధం టీం. స్టోరీలో ఇదే కీలకమైన పాయింట్ అని తెలుస్తోంది. తాజాగా లీక్ అయిన ఫోటో ఇక్కడిదేలే. అయితే.. వైష్ణవ ఆలయంలో శివపూజ అనగానే.. చాలామంది వైష్ణవులు అక్కడికి తరలివచ్చేశారట. షూటింగ్ కి అడ్డుపడి ఆగిపోవడానికి కారణం అయ్యారట. మీడియా కూడా ఈ వివాదాన్ని బాగానే ఫోకస్ చేసింది.

అయితే.. తాము ఈ రకంగా షూటింగ్ చేయడానికి దేవస్థానం నుంచి అవరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని వారిని శాంతపరిచిందట డీజే టీం. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సందర్భాన్ని కూడా వివరించడంతో.. శాంతించిన వైష్ణవులు అక్కడి నుంచి నిష్క్రమించారని అంటున్నారు. ఆ తర్వాత తిరిగి షూటింగ్ మళ్లీ మొదలు పెట్టి.. సూపర్ స్పీడ్ లో చేసేస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. కామెడీ ఎంటర్టెయినర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. బన్నీ మార్క్ యాక్షన్ కు లోటు ఉండదని టాక్.