రియల్ ఎస్టేట్ స్కాం తీశావా బన్నీ?

Mon Jun 19 2017 20:01:07 GMT+0530 (IST)

అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథమ్ ఈనెల 23న థియేటర్లకు రానుంది. తొలిసారిగా ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనుండటం ఈ సినిమా పై ఆసక్తి పెంచే అంశమే అయినా.. ఈ పాత్ర కేవలం అగ్రహారంలో ఉండే సంప్రదాయ బ్రాహ్మణ యువకుడు తనకు ఎదురైన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చేసే పోరాటం తరహాలో కాకుండా.. కాస్త పొలిటికల్ టచ్ లో ఉండోబోతంది అనే అంశమే కాస్త కలవరపెడుతోంది.

అల్లు అర్జున్ పోరాటాల సంగతి ఎలా ఉన్నా సాధారణ బ్రాహ్మణ యువకుడు ఓ రేంజ్ లో పోరాటాలకు దిగడం వెనుక ఏ కథ ఉందని  ఆరా తీస్తే.. ప్రస్తుతం  ఆంధ్రలో నడుస్తున్న ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంను బేస్ గా చేసుకుని ఈ కథను తీర్చిదిద్దారట. పెద్దలంతా తెర వెనుక ఉండి నడిపించిన కుంభకోణంలో సామాన్యులు నిట్టనిలువునా మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ భూ కుంభకోణం నిగ్గు తేల్చే క్రమంలో యుద్ధం శరణం గచ్చామి అంటూ బన్నీ రంగంలోకి దిగనున్నాడన్నది ఫిలిం నగర్ టాక్. అయితే ఇలాంటి పొలిటికల్ స్కాములను ఆధారం చేసుకుని వచ్చిన సినిమాలు చాలామటుకు జనాలకు ఎక్కలేదు. ఎందుకంటే రోజూ టివి ఛానళ్ళలో న్యూస్ పేపర్లలో చూసేది ఇక తెరపై ఏం చూస్తారు?

అల్లు అర్జున్ గతంలో చేసిన జులాయి సినిమా బ్యాంకు కుంభకోణం చుట్టూ తిరిగిందే. డిపాజిటర్లకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి ఆనక జనాలకు నామం పెట్టడంతో నష్టపోయిన కుటుంబంలోని యువకుడి పోరాటం బేస్ గా ఆ సినిమా తీశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలపై సినిమా తీశారన్నది లేటెస్ట్ టాక్. ఈ స్కాము కథ ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/