Begin typing your search above and press return to search.

80 కోట్లు వస్తేనే దువ్వాడ జగన్నాథమ్ సేఫ్‌

By:  Tupaki Desk   |   22 Jun 2017 8:08 AM GMT
80 కోట్లు వస్తేనే దువ్వాడ జగన్నాథమ్ సేఫ్‌
X
ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల్లో ముందుగా బాహుబలి 2 తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డిజె దువ్వాడ జగన్నాథమ్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాండ్ హిట్ కొట్టేస్తే.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతున్న పెద్ద స్టార్ల జాబితాలోకి చేరిపోవడమే కాదు.. రొటీన్ కథతో కూడా వరుస హిట్లు కొట్టగలిగే డిపెండబుల్ సూపర్ స్టార్ గా మారిపోతాడు. కాని అలా జరగాలంటే మాత్రం.. ఇప్పుడు పెద్ద మొత్తంలోనే వసూలు చేయాలి.

హరీశ్ శంకర్ డైరక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన 'డిజె' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఈ విషయంపై మనకు క్లారిటీ వస్తుంది. నైజాంలో 17.5 కోట్లకు అమ్ముడైన డిజె.. ఇతర ప్రముఖ ఏరియాలైన సీడెడ్ లో 11 కోట్లు.. వైజాగ్ లో 8 కోట్లు.. ఈస్ట్ లో ఐదున్నర.. వెస్ట్ లో నాలుగున్నర కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు అమ్ముడుపోయింది. అదే విధంగా ఓవర్సీస్ లో 7 కోట్లు.. కర్ణాటకలో 7 కోట్లు.. ఇక ఇతర నాన్ తెలుగు ప్రాంతాలను కలుపుకుని.. మొత్తంగా 78 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే జరిగింది. అంటే ప్రింట్ అండ్ పోస్టర్ ఖర్చులను కలుపుకుని రేపు సినిమా హాళ్ల నుండి షుమారుగా 80 కోట్లు వసూలు చేస్తేనే ఈ పంపిణీదారులు అందరూ సేఫ్‌ గా ఉంటారు. 80 పైన ఎంత వసూలు చేస్తే అంత లాభం వచ్చినట్లు. సో దువ్వాడ టార్గెట్ దాదాపు ఒక ఇండస్ర్టీ హిట్ రేంజులో ఉందన్నమాట.

ఇకపోతే 18 కోట్లు శాటిలైట్ హక్కుల నుండి రాగా.. 5 కోట్లు ఇతర డిజిటల్ హక్కుల నుండి వచ్చాయి. మొత్తంగా అల్లు అర్జున్ కెరియర్లో ఏకంగా ఒక సినిమా 100 కోట్లకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. అంటే నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ పిచ్చ సేఫ్‌ అనమాట. మరి పంపిణీదారులకు ఏమవుతుందో తెలియాలంటే.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/