Begin typing your search above and press return to search.

అర్జంట్ గా ఆల్ టైం హిట్ కావాలి

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:58 AM GMT
అర్జంట్ గా ఆల్ టైం హిట్ కావాలి
X
అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా దువ్వాడ జగన్నాథమ్ కలెక్షన్లతో ఇప్పుడు కొత్త కొత్త చిక్కులు వస్తున్నాయి. డిజె సినిమా స్టోరీపై నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ అన్ని వర్గాల్లో అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తో ఈ సినిమాకు వసూళ్లు గట్టిగానే వచ్చాయి. ఈ కలెక్షన్లు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంటే మెగా ఫ్యామిలీలోని మరో స్టార్ హీరో కు సవాల్ లా మారాయి.

రామ్ చరణ్ రీసెంట్ మూవీ ధృవ సినిమాకు మొత్తం వచ్చిన కలెక్షన్లను దువ్వాడ జగన్నాథమ్ వారంలోనే సాధించేస్తుందని... మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత మెగాస్టార్ బన్నీయేనంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీడియాలోనూ ఇదే తరహా ప్రచారం వస్తుండటంతో ఫ్యాన్ బేస్ నుంచి రామ్ చరణ్ పై ప్రెజర్ పెరుగుతోంది. దువ్వాడ జగన్నాథమ్ కలెక్షన్లు మించేలా మెగా పవర్ స్టార్ తర్వాత మూవీ ''రంగస్థలం 1985'' ఉండాలని అడుగుతున్నారట. ధృవ సినిమా డీమానిటైజేషన్ టైంలో రావడం ఆ సినిమా కలెక్షన్లపై గట్టి ప్రభావమే చూపింది. ఆ విషయం పట్టించుకోకుండా పోలిక తేవడం సరికాదన్నది రామ్ చరణ్ అభిమానుల ఆవేదన.

రేసుగుర్రం - సరైనోడు - దువ్వాడ జగన్నాథమ్ ఇలా బన్నీ సినిమా ఒకదానిని మించి మరొకటి కలెక్షన్లు సాధించాయి. యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ అతడికి క్రేజ్ పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. రామ్ చరణ్ ఈ రేంజ్ చేరాలంటే ఈ తరుణంలో మగధీర లాంటి ఆల్ టైం హిట్ అవసరం. మరి రంగస్థలం అతడి అభిమానుల ఆశలు నెరవేరుస్తుందో లేదో వెయిట్ అండ్ సీ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/