Begin typing your search above and press return to search.

రాక్‌ స్టార్‌ పై బ‌న్నీ కొటేష‌న్‌!!

By:  Tupaki Desk   |   23 March 2018 10:52 AM GMT
రాక్‌ స్టార్‌ పై బ‌న్నీ కొటేష‌న్‌!!
X
టాలీవుడ్‌ లో రాక్‌ స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ కీ - స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ కీ మ‌ధ్య మంచి స్నేహం ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వేరే వాళ్ల సినిమాల‌కి మ్యూజిక్ ఇచ్చిన‌ప్పుడు దేవీ కాస్త నెమ్మ‌దించి, టెంపో త‌గ్గిస్తాడేమో... కానీ బ‌న్నీ సినిమా అన‌గానే త‌న‌లోని టాలెంట్‌ని మొత్తం బ‌య‌టికి తీసేస్తాడు. అందుకే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి.

బ‌న్నీకి మంచి మాస్ బీట్‌ లో డ్యాన్స్ చేయ‌డం అంటే ఇష్టం. బ‌న్నీకి ఊపు వ‌చ్చేలా మ్యూజిక్ ఇవ్వ‌డం డీఎస్పీకి బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘చాలాకాలం క్రితం దేవిశ్రీ‌ప్ర‌సాద్ విన్న‌ప్పుడు నా మ‌న‌సుకి తోచిన కొటేష‌న్‌’ అంటూ దేవి ఫోటో మీద ఓ కొటేష‌న్ టైపు చేసి త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్‌ లో పోస్టు చేశాడు బ‌న్నీ. దేవీశ్రీ ప్ర‌సాద్ ఫోటో మీద ‘ఎ గ్రేట్ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యూ ప్లే - ఇట్స్ వాట్ యూ సే’ అని రాసి ఉంది. ‘నువ్వు ప్లే చేసేది గొప్ప పాట కాదు - నువ్వేం చెప్పాల‌నుకుంటున్నావో అదే గొప్ప పాట‌’ అని అర్థం. దీనికి కాస్త లేట‌యినా - లేటెస్టుగా స్పందించాడు డీఎస్‌ పీ. బ‌న్నీ పోస్టు చేసిన పోటోనే తీసుకుని - త‌న అకౌంట్‌ లో పోస్టు చేసిన దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ - ‘త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ల‌వ్లీ పోస్టును పెట్టినందుకు నా ప్రియ‌మైన స్నేహితుడు అల్లుఅర్జున్‌ కి థ్యాంక్ యూ సో మ‌చ్‌! లేటుగా చూసినందుకు సారీ... హౌ స్వీట్ ఆఫ్ యూ బ‌న్నీ బాయ్‌... ’ అంటూ కామెంట్ పెట్టాడు.

బావ రామ్‌ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’ సినిమాకీ దేవిశ్రీ ఇచ్చిన సంగీతం బాగా న‌చ్చేసి - బ‌న్నీ ఈ ర‌కంగా పోస్టు చేసి ఉంటాడ‌ని ఆయ‌న అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేయ‌బోయే సినిమాకు, దేవిశ్రీ‌ప్ర‌సాదే సంగీతం అందించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.