Begin typing your search above and press return to search.

బన్నీ 20కి భలే కథను పట్టారే

By:  Tupaki Desk   |   25 April 2019 7:20 AM GMT
బన్నీ 20కి భలే కథను పట్టారే
X
నిన్నటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీని తర్వాత వేణు శ్రీరామ్ తో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ పేరుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి కిటకిట అనే ఓ ఫిలిప్పైన్స్ సినిమా స్ఫూర్తి అంటూ పలు కథనాలు వచ్చాయి. లైన్ ఇదే అంటూ కొన్ని ఆధారాలు కూడా చూపించారు. అయితే యూనిట్ వాటిని పూర్తిగా నిరాధారమంటూ కొట్టేస్తోంది.

అసలు దానికి దీనికీ పోలికే ఉండదని రోడ్డు జర్నీ మీద సినిమా నడిచే పాయింట్ ని ఆధారంగా చేసుకుని కిటకిట కంటే ముందే చాలా సినిమాలు తెలుగులోనే వచ్చాయని చెబుతున్నారు. సో మేజర్ డౌట్ ఒకటి క్లియర్ అయినట్టే. కాని లైన్ కు సంబంధించిన ఓ అప్ డేట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. దాని ప్రకారం ఇందులో బన్నీ తన బైకు పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. ఇలాంటివి మాములే అన్న ఉద్దేశంతో వాళ్ళు లైట్ తీసుకుంటారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన బన్నీ పోలీసు డిపార్టుమెంటు మొత్తం షేక్ అయిపోయేలా మైండ్ గేమ్ మొదలుపెడతాడు. ఆ క్రమంలోనే హీరొయిన్ పరిచయం అవుతుంది. ఇక అక్కడి నుంచి ఎన్నో నాటకీయ మలుపుల మధ్య జర్నీ బ్యాక్ డ్రాప్ లో కథ మంచి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బాగుంది కదూ. ఇది అధికారికంగా వచ్చిన న్యూస్ కాదు కాని ఇంచుమించు ఇదే లైన్ మీద ఐకాన్ సాగుతుందని న్యూస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న మూవీ దసరా లేదా దీపావళికి విడుదల కాగానే బన్నీ దీంట్లో ఎంటరైపోతాడు.