Begin typing your search above and press return to search.

అది అల్లు అర్జున్ గొప్పదనం అంటున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   22 Nov 2018 5:33 AM GMT
అది అల్లు అర్జున్ గొప్పదనం అంటున్న డైరెక్టర్
X
'టాక్సీవాలా' విజయంతో విజయ్ దేవరకొండ క్రేజ్ మరో సారి ప్రూవ్ అయిందని అందరూ అంటున్నారు గానీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తక్కువ బడ్జెట్ లో మంచి మంచి క్వాలిటీ థ్రిల్లర్ ను డైరెక్ట్ చేసిన విధానం.. విజయ్ దేవరకొండ ను హ్యాండిల్ చేసిన తీరు ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు రాహుల్.

ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ "అల్లు అర్జున్ గారు నాకంటే కూడా నిర్మాత ఎస్కేఎన్ గారికి బన్నీ వాసుగారికి చాలా క్లోజ్. నాకు ఎప్పుడూ బన్నీగారితో ఇంటరాక్షన్ లేదు. కానీ 'టాక్సీవాలా' మూవీ హిట్ అయిన రోజు రాత్రి బీ-డబ్స్ లో అల్లు అర్జున్ గారు మాకందరికీ పార్టీ ఇచ్చారు. పార్టీలో కలిసినప్పుడు అల్లు అర్జున్ నన్ను పక్కకు తీసుకెళ్ళి 'అయామ్ వెరీసారీ.. మై అపాలజీస్ టూ యు' అన్నారు. దేనికండీ... మీరు నాకెందుకు సారీ చెబుతున్నారు అని అడిగాను. 'ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేను నీ గురించి చెప్పడం మర్చిపోయాను' అన్నారు. నేను దానికి.. అవసరం లేదండీ మనకు ముందు పరిచయం లేదు పైగా మీరు నా వర్క్ కూడా చూడలేదు.. నా పేరు అక్కడ మెన్షన్ చేయాల్సినంత అవసరం లేదు.. అప్పుడు బన్నీగారు 'మీరు తెలుసా లేదా.. నేను మీ వర్క్ చూశానా అని కాదండీ. డైరెక్టర్ అంటే ఒక గౌరవప్రదమైన పొజిషన్. డైరెక్టర్ గురించి స్టేజ్ మీద ఉన్నవారు మాట్లాడాలి. నేను మాట్లాడకపోవడం నాతప్పు. నేను స్టేజ్ దిగేటప్పుడే నాకు నేనేదో మిస్ అయ్యానని నాకు అర్థం అయింది.. బట్ ఐ యాం సారీ' అని చెప్పారు."

అల్లు అర్జున్ గారు అలా మాట్లాడడంతో అయనది ఎంత ఉన్నతమైన స్వభావామో తనకు అర్థం అయింది. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా అలా ప్రవరించడం గ్రేట్ అని అన్నాడు. మీరు ఫ్యూచర్ లో ఎవరితో పనిచేయాలని అనుకుంటున్నారు అని అడిగితే "దుల్కర్ సల్మాన్ - విజయ్ సేతుపతి.. ఆమీర్ ఖాన్ కమల్ హాసన్ గారు" అని పేర్లు చెప్పాడు. ఫైనల్ టచ్ ఇస్తూ "అండ్ చిరంజీవి గారు.. చిన్నప్పటినుండి అయన ఫ్యాన్" అన్నాడు. అయిన ఎవరైనా మెగాస్టార్ ఫ్యాన్ కాకపోతే ఆశ్చర్యపడాలిగానీ అయితే ఏం ఆశ్చర్యం?