సమంతకు బన్నీ పాఠాలు...వైరల్!

Wed Aug 15 2018 19:40:06 GMT+0530 (IST)


టాలీవుడ్ లోని హీరోయిన్లలో అక్కినేని సమంత ...సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనతోపాటు తన భర్త చైతూ - మామగారు నాగార్జునలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికపుడు ట్వీట్ చేయడం సామ్ కు అలవాటు. అంతేకాకుండా - వీలు చిక్కినప్పుడల్లా  ఫ్యాన్స్ తో కూడా ట్విట్టర్ లో సామ్ ఇంటరాక్ట్ అవుతుంటుంది. తాజాగా ఓ అల్లు అర్జున్ వేసిన ఓ స్టెప్పుపై సమంత ఓ ఫన్నీ ట్వీట్ చేసింది. ఆ స్టెప్పును ఎంత ప్రాక్టీస్ చేసినా రావడం లేదంటూ....సామ్ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ ను చూసిన అల్లు అర్జున్ సామ్ కు రిప్లై ఇస్తూ రీట్వీట్ చేశాడు. ఆ స్టెప్పు వేయడం చాలా ఈజీ అని....కావాలంటే ఆ స్టెప్పు నేర్పిస్తానని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి స్వీట్ ట్వీట్ చాట్....సోషల్ మీడియాలో వైరల్ అయింది.బన్నీ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో ‘యామ్ ఎ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ పాట హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటలో  బన్నీ క్యాప్ తో చేసిన డ్యాన్స్ హైలైట్ అయింది. స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండానే స్టైలిష్ స్టార్ స్వతహాగా క్యాప్ తో అదిరిపోయే స్టెప్పులేశాడు.అయితే ఆ స్టెప్పు వేయాలని సమంత తెగ కష్టపడిందట. బన్నీలా `క్యాప్` డ్యాన్స్ చేసేందుకు 3 నెలలు కష్టపడిందట. అయినా కూడా తనకు ఆ స్టెప్ వేయడం రాలేదట. కష్టపడటంలో అల్లు అర్జున్ నెంబర్ వన్ అంటూ నమస్కారం ఎమోజీలతో సామ్ ట్వీట్ చేసింది. దాన్ని చూసిన బన్నీ సామ్ ట్వీట్ కు రీట్వీట్ చేశాడు. ‘ధన్యవాదాలు సామ్. ఇప్పుడే ట్వీట్ చూశా. మీకు ట్రిక్స్ నేర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేర్పేవారుంటే ఆ స్టెప్ వేయడం చాలా సులభం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. దానికి సామ్ కూడా సరేనంటూ బన్నీకి థ్యాంక్స్ చెప్పింది.