Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్.. రజినీకి బ్యాండ్ పడనుందా?

By:  Tupaki Desk   |   14 Feb 2018 7:52 AM GMT
ఫస్ట్ టైమ్.. రజినీకి బ్యాండ్ పడనుందా?
X
ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ రోజుల్లో ఒకే ఏరియాలో అన్ని థియేటర్స్ నిండా అదే సినిమా కనిపిస్తుంది. కొడితే వారం రోజుల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొట్టేయాలని స్టార్స్ థియేటర్స్ ఎన్ని దొరికితే అన్ని దక్కించుకుంటున్నారు. ఆడియెన్స్ కూడా మొదటి మూడు రోజుల్లోపే సినిమా చూడాలని ఆలోచనతో ఉంటున్నారు. దీంతో చాలా వరకు స్టార్ హీరోలు హాలిడేస్ ని టార్గెట్ చేసి ఎక్కువ థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. పరభాష స్టార్ కథానాయకుల సినిమాలు ఇక్కడ అనువాదమైనప్పుడు భారీ స్థాయిలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రజినీకాంత్ సినిమాలు ఏ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రజినీ కాలా సినిమా కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయాలనీ ధనుష్ అనుకుంటున్నాడు. కానీ ఈ సారి ఆ పప్పులు ఏమి ఉడికేలా లేవు. ఎందుకంటే మన స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ థియేటర్స్ ని మొత్తంగా కవర్ చేయాలనీ అనుకుంటున్నారు.

అల్లు అర్జున్ నా పేరు సూర్య.. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలు ఏప్రిల్ 26న రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ తరువాత రోజు ఏప్రిల్ 27న కాలా రిలీజ్ కానుంది. మొదట బన్నీ మహేష్ తప్పుకుంటున్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ వారు ఏ మాత్రం తగ్గకూడదు అనేలా పక్కా ప్లాన్ తో వస్తున్నారు. అసలే వారికీ దిల్ రాజు అల్లు అరవింద్ సపోర్ట్ ఉంది. థియేటర్స్ వారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి కాలా కి ఎక్కువ థియేటర్స్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఫస్ట్ టైమ్ రజినీకి బ్యాండ్ పడనుందా అనే టాక్ వినిపిస్తోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.