Begin typing your search above and press return to search.

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బన్నీ.. బోయపాటి

By:  Tupaki Desk   |   27 May 2016 5:39 AM GMT
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బన్నీ.. బోయపాటి
X
ప్రముఖ యువ నటుడు అల్లు అర్జున్.. దర్శకులు బోయపాటి శ్రీనుకు చేదు అనుభవం ఎదురైంది. సరైనోడు చిత్రం విజయవంతమైన నేపథ్యంలో మొక్కు చెల్లించుకోవటానికి విశాఖలోని సింహాచలానికి వచ్చిన వారికి ఊహించని ఘటన ఎదురైంది. సింహాచల వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటానికి శుక్రవారం వారు ఆలయానికి వెళ్లారు.

స్వామిని దర్శించుకున్న వారు బయటకు వచ్చే క్రమంలో వారు లిఫ్ట్ ఎక్కారు. అయితే.. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. దీంతో.. దాన్ని పని చేయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో ఆలయ సిబ్బంది లిఫ్ట్ డోర్లను పగలగొట్టి వారిని బయటకు తీశారు. లిఫ్ట్ పని చేయకపోవటానికి కారణం బన్నీ వెంట వచ్చిన వారు.. అభిమాన గణం పరిమితికి మించి ఎక్కటంగా చెబుతున్నారు.

అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటనతో ఉలిక్కిపడిన ఆలయ అధికారులు.. వారిని బయటకు తీసేందుకు పరుగులు తీసిన పరిస్థితి. లిఫ్ట్ లో నుంచి క్షేమంగా బయటపడటంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.