Begin typing your search above and press return to search.

ఎన్నారైలతో బన్నీ మరో మీటింగ్

By:  Tupaki Desk   |   27 July 2017 7:09 AM GMT
ఎన్నారైలతో బన్నీ మరో మీటింగ్
X
మొన్నామధ్యన 'డిజె దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళాడు అల్లు అర్జున్. అక్కడకు వెళ్ళాడన్నా మాటేగాని.. ఎందుకో మనోడు చాలా టెన్స్ గానే ఉన్నాడు. అంతేకాదు.. అక్కడ ఏర్పాటు చేసిన మీటింగులలో అందరికీ కేవలం ఒక 10 నిమిషాలు హాయ్ చెప్పేసి జంప్ అయిపోయాడు. మరి సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళి.. ఎన్నారైలతో సత్సంభందాలు ఏర్పడేలా వారితో కలవకపోతే ఎలా? ఇదే పాయింట్ చాలా లేటుగా రియలైజ్ అయినట్లున్నాడు.

ఈ మధ్యన చాలాసార్లు మన తెలుగు హీరోలు అమెరికా వెళ్ళి.. అక్కడున్న తెలుగువారితో సుదీర్ఘంగా మంతనాలు జరిపి.. వారిని ఆకట్టుకుంటున్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష ఫలితమే వారి సినిమాలకు అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్ళు కురవడం. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మరోమారు ఎన్నారైలను కలిసే పనిలో ఉన్నాడు. ఎలాగో మనోడు నెల రోజుల ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళనున్నాడు. తన తదుపరి సినిమా 'నా పేరు సూర్య' కోసం ఒక పటిష్టమైన సైనికుడిలా కనిపించాలని.. తన దేహ ధారుడ్యం కొత్తగా ఉండాలని.. మనోడు యుఎస్ లో ట్రైనింగ్ తీసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అక్కడ ఉన్న నెల్లాళ్ళూ చాలామంది తెలుగు వారిని కలిసే యోచనలో ఉన్నాడట.

ఆల్రెడీ స్టయిలిష్‌ స్టార్ నెల రోజులు అమెరికా వస్తున్నాడంటే.. అక్కడి ఎన్నారైలు చాలామంది ఎక్సయిటెడ్ గా ఉండటమే కాదు.. బన్నీని కలసేందుకు వారు కూడా సన్నద్దమవుతున్నారట. కాబట్టి ఈ మీటింగ్ తరువాత తన సినిమాలకు అక్కడ మార్కెట్ పెంచుకోవడమే కాదు.. పూర్తిగా ఎన్నారైలలో తన అభిమానగణాన్ని కూడా పెంచుకునే దిశలో అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడట. అది సంగతి.