Begin typing your search above and press return to search.

అల్లు వారు.. పవన్ ఫ్యాన్.. కలసి..

By:  Tupaki Desk   |   27 March 2017 12:25 PM GMT
అల్లు వారు.. పవన్ ఫ్యాన్.. కలసి..
X
ఈరోజు మార్చి 27.. రామ్ చరణ్‌ ఫ్యాన్స్ కు పండగ రోజు. ఈ డ్యాషింగ్ మెగా హీరో ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే ఈ సందర్భంగా చరణ్‌ ఫ్యాన్స్ కొన్ని గాసిప్పులకు తెరదించే పనిచేశారు. ఒక ప్రక్కన చరణ్‌ ఫారిన్ డెస్టినేషన్లో తన పుట్టినరోజు జరుపుకుంటుంటే.. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నిర్మాత అల్లు అరవింద్ అలాగే యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఒక ప్రక్కన అల్లు అరవింద్ తన చాణక్యానికి పాపులర్ అయితే.. మరో ప్రక్కన పవన్ ఫ్యాన్ గా మెగా హీరోల్లోనే సాయిధరమ్ ఒక కొత్తరకం ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలసి చరణ్‌ కోసం కేక్ కట్ చేశారంటే.. అసలు పవన్ ఫ్యాన్స్ అండ్ బన్నీ ఫ్యాన్స్ మధ్యన పెద్దగా మ్యాటర్ చెడిందేమీ లేదని ప్రపంచానికి ఒక హింట్ ఇస్తున్నారా అనే సందేహం వస్తోంది కదూ!!

ఏదేమైనా కూడా మెగా హీరోలు.. మెగా ఫ్యామిలీ మెంబర్లు.. అందరూ ఒకరికి ఒకరు కలసి వస్తున్నప్పుడు.. అనవసరంగా ఫ్యాన్స్ విడిపోయి కొట్టుకోవడం మంచిది కాదేమో. చరణ్‌ బర్త్ డే సాక్షిగా వీరు మారిపోతారేమో చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/