Begin typing your search above and press return to search.

ఆలోచించండి అరవింద్ గారు

By:  Tupaki Desk   |   17 Aug 2018 3:15 AM GMT
ఆలోచించండి అరవింద్ గారు
X
గీత గోవిందం ఊహించిన దాని కన్నా స్ట్రాంగ్ గా నిలబడిపోయింది. రిస్క్ తీసుకుని బుధవారమే విడుదల చేయటం ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. లాంగ్ వీక్ ఎండ్ ని ఫుల్ గా వాడేసుకుంటున్నారు గీత గోవిందులు. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోంది అన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఇక దర్శకుడు పరశురామ్ గురించి చెప్పేదేముంది. దెబ్బకు డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. గీతా-మంచు-మైత్రి ఇలా మూడు బ్యానర్లకు కమిట్ మెంట్ ఇచ్చేసాడు. ఇందులో ఏది ముందు స్టార్ట్ అవుతుందో చెప్పలేదు కానీ రెండు కథలైతే సిద్ధంగా ఉన్నాయట. నిజానికి పరశురామ్ సోలోతోనే తన టాలెంట్ చూపించినప్పటికీ స్టార్ హీరోతో చేసిన సినిమాలు ఆడకపోవడంతోనే బ్రేక్ ఆలస్యం అయ్యింది. రవితేజతో ఆంజనేయులు-సారొచ్చారు రెండూ వర్క్ అవుట్ కాలేదు. కొంత గ్యాప్ తో చేసిన శ్రీరస్తు శుభమస్తు తిరిగి ట్రాక్ లోకి తెచ్చేసింది. అది కూడా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందిన సినిమానే. ఇప్పుడు గీత గోవిందం తర్వాత హ్యాట్రిక్ కూడా తమ బ్యానర్ లోనే చేసేలా గీత ఆర్ట్స్ 2 రెడీ అవుతోంది.

కానీ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఇప్పటి దాకా బన్నీతో సహా ఏ పెద్ద హీరోతో సినిమా చేయలేదు. అన్ని బడ్జెట్ లోపువే తీసుకుంటూ వచ్చారు. మాతృ సంస్థ గీత ఆర్ట్స్ లో మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పరశురామ్ కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు కాబట్టి అతనితో పెద్ద సినిమా ప్లాన్ చేసుకున్నా రిస్క్ ఉండదు. మార్కెట్ పరంగా కూడా సమస్య రాదు. కానీ గీత ఆర్ట్స్ 2లోనే నెక్స్ట్ మూవీ కూడా ఉంటుందని చెప్పడం చూస్తే హీరో ఎవరు ఉంటారా అనే సందేహం రాక మానదు. పరశురామ్ గీత ఆర్ట్స్ 2 లో ఎలాగూ రెండు సినిమాలు చేసాడు. అల్లు శిరీష్ కు చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ క్రేజ్ తోడవ్వడంతో గీత గోవిందం బ్లాక్ బస్టర్ గా మార్చాడు. సో స్టార్ పవర్ తోడైతే పరశురామ్ సినిమాను పెద్ద రేంజ్ కు తీసుకెళ్లే అవుట్ ఫుట్ ఇవ్వగలడు. మెగా కాంపౌండ్ లోనే కావలసినంత హీరోలు ఉన్నారు. అలా కాదు అనుకున్నా గీత ఆర్ట్స్ బ్యానర్ అంటే డేట్లు ఇవ్వని హీరో ఉండరు. సో కాస్త అల్లు అరవింద్ ఆ కోణంలో ఆలోచిస్తే పరశురామ్ కు ఇంత కన్నా మెగా బ్రేక్ ఇవ్వోచ్చేమో కదా.