వావ్.. సూపర్ స్టార్ తో గీతా ఆర్ట్స్

Fri Jun 22 2018 10:09:27 GMT+0530 (IST)

నిర్మాతగా అల్లు అరవింద్ రేంజ్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ఉన్న వాల్యూ హై లెవెల్ లోనే ఉంటాయి. అయితే.. భారీ సినిమాల విషయంలో మెగా హీరోలతోనే తీసేందుకు మొగ్గు చూపే ఆయన.. అప్పుడప్పుడు లో- మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా తెరకెక్కిస్తూ ఉంటారు.  కానీ ఇతర స్టార్ హీరోలతో అల్లు అరవింద్ సినిమా తీయడం అంటే కాసింత ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. రీసెంట్ గా కలిసిన వీరిద్దరూ ఇదే విషయంపై కాసేపు మాట్లాడుకున్నారట కూడా. మహేష్ తో మూవీ చేయాలనే ఉద్దేశ్యాన్ని అల్లు అరవింద్ వెలిబుచ్చారట. దీనికి మహేష్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. అయితే.. నిజంగా ఇది సాధ్యమేనా అనే విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి.

మహేష్ తో అల్లు అరవింద్ ప్రతిపాదన పెట్టినా.. అటు స్క్రిప్ట్ కానీ.. ఇటు ప్లానింగ్ కానీ రెండూ లేవని.. జస్ట్ ఓ మాట మాత్రమే అనుకున్నారనే విషయం గుర్తు చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకవేళ నిజంగానే దర్శకుడు.. స్క్రిప్ట్ రెడీ అయితే మాత్రం.. అల్లు అరవింద్ తో మూవీ చేసేందుకు బహుశా మహేష్ కు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం మహేష్ కమిట్మెంట్స్ ఎక్కువగానే ఉన్నాయనే విషయం గమనించాలి.