విజయ్ పై అల్లు అరవింద్ కాన్ఫిడెంట్

Sun Jun 24 2018 18:48:47 GMT+0530 (IST)


అప్పట్లో నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ట్రెండ్ సెట్టర్. ఈ మూవీ తర్వాత చాలా రోజులకు అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.  ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీ విజయ్ దేవరకొండకు ఎంతో పేరు తీసుకొచ్చింది. విజయ్ కెరీర్ లోనే ఇలాంటి సినిమా మళ్లీ వస్తుందని .. దాన్ని మించిన సినిమా తీస్తాడన్న గ్యారెంటీ లేదు.అయితే తాజాగా స్టార్ ప్రొడ్యూసర్  అల్లు అరవింద్ విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ప్రస్తుతం అల్లు అరవింద్  విజయ్ తో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తీసిన ‘టాక్సీవాలా’ పూర్తయ్యింది. విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

తాజాగా టాక్సీవాలా పూర్తి కావడంతో విజయ్ తో మరో సినిమాకు అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. అదే ‘గీతాగోవిందం’. పరుశురామ్ దర్శకుడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశాడు అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గీతాగోవిందం ’ విజయ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని అన్నాడు. పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ నటుడిగా నిరూపించుకున్నాడు. గీతాగోవిందం విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అవుతుందని ధీమా గా చెబుతున్నానని అరవింద్ అన్నారు.

ఇప్పటి వరకూ అర్జున్ రెడ్డినే విజయ్ కు బెస్ట్ ఫిలిం అని అందరూ అంటుండగా.. దాన్ని మించి ‘గీతా గోవిందం’ ఉండబోతుందని అల్లు అరవింద్ అనడం చూశాక ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ స్టార్ ప్రొడ్యూసర్ నే మెప్పించిన ఆ కథ ఎలా ఉండబోతుంది.? అందులో విజయ్ ఎలా నటిస్తాడనేది చూడాలి మరి.