Begin typing your search above and press return to search.

రాజమౌళిని చుట్టుకుంటున్న వివాదం

By:  Tupaki Desk   |   21 May 2017 7:46 AM GMT
రాజమౌళిని చుట్టుకుంటున్న వివాదం
X
'ఒక్కొక్కణ్ని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకే సారి రమ్మను' అంటూమగధీర మూవీలో రామ్ చరణ్ చెప్పే యుద్ధ సన్నివేశలో మహాశివుడు విగ్రహం చుట్టూనే యుద్ధం జరుగుతుంది. దీనికి అష్టగ్రహ కూటమి అనే ఓ కాన్సెప్ట్ లింక్ అయి ఉంటుంది. ఇక తాజాగా బాహుబలి చిత్రంలో శివ లింగాన్ని ప్రభాస్ భుజాలపై మోసే సీన్ అద్భుతంగా తీశాడు రాజమౌళి.

శివుడు పేరుతోనే పెరుగుతాడు మహేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి కూడా అనుష్క దగ్గర తన పేరు శివుడు అనే అబద్ధం చెబుతాడు. అలాగే అగ్నిప్రస్థం అంటూ ఓ కాన్సెప్ట్ తో అమ్మవారి గుడి దగ్గర రాక్షస దహనం సీన్ బాహుబలి2లో ఉంటుంది. ఇన్నిటిని చూసిన తర్వాత రాజమౌళి కచ్చితంగా శివభక్తుడు అని అంతా అనుకోవచ్చు. కానీ తాను నాస్తికుడిని అని చెప్పి జక్కన్న సెన్సేషన్ సృష్టించాడు. అదే ఇప్పుడు వివాదం అయిపోతోంది. తాను నాస్తికుడు అయితే.. దేవుళ్లకు సంబంధించిన సన్నివేశాలను ఎలా తీస్తాడన్నది ఆస్తికుల వాదన.

ఆయా సన్నివేశాలు కూడా సినిమాకు అత్యంత కీలకంగా ఉటాయి. భారత దేశంలో దేవుడిపై విశ్వాసం సన్నగిల్లడానికి ఇలాంటి ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలే కారణం అంటున్నారు. సినిమా కోసం ఆస్తికత్వాన్ని ఉపయోగించుకుంటూ.. వారి నిజ జీవిత భావాలను సమాజంపై దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని ఆస్తికులు ఖండిస్తున్నారు. మరి రాజమౌళి ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడో! లేక దీన్ని కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న టైపులో ఏళ్లకేళ్లు సాగదీస్తాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/