Begin typing your search above and press return to search.

మళ్లీ సెల్ఫీ సినిమానా అల్లరి రాజా!!

By:  Tupaki Desk   |   30 Aug 2016 1:05 PM GMT
మళ్లీ సెల్ఫీ సినిమానా అల్లరి రాజా!!
X
అల్లరోడు ఆ మధ్య బాగా డల్ అయిపోయాడు. అతి తక్కువ కాలంలోనే 50 సినిమాలు పూర్తి చేసిన ఈ హీరో.. బాగా జోరు చూపించాల్సిన టైమ్ లో స్లో అవడానికి కారణం వరుసగా ఎదురైన ఫ్లాపులే. అయితే.. మరీ దారుణమైన పరాజయాలను ఎదుర్కున్న ఈ కామెడీ హీరో.. రీసెంట్ గా చేసిన మూవీ సెల్ఫీ రాజా. కంటెంట్ విషయంలో విమర్శలు వచ్చినా.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ సినిమా ఫేర్ చేసింది. చాలా రోజుల తర్వాత ఆఫ్ స్క్రీన్ లోనూ అల్లరి నరేష్ ని నవ్వేలా చేసింది.

ప్రస్తుతం ఈ అల్లరి కుర్రాడు చేస్తున్న సినిమా 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. దసరా నాటికి రిలీజ్ చేయాలన్నది హీరో-నిర్మాతల ఆలోచన. ఇలాంటి టైమ్ లో.. అల్లరి నరేష్ మళ్లీ ఓ సెల్ఫీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. గతేడాది రిలీజ్ అయిన మలయాళ మూవీ ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడట అల్లరి నరేష్. ఈ హీరోకి రీమేకులు కొత్తేం కాదు. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సుడిగాడు కూడా తమిళ్ రీమేక్ మూవీనే.

అయితే.. ఇప్పటికే సెల్ఫీ రాజా అంటూ హంగామా చేసేసి.. మళ్లీ సెల్ఫీ సినిమా ఏం చేస్తాడనే డౌట్ రావచ్చు. కానీ ఇదో క్రైమ్ కామెడీ బాపతు సినిమా. డైరెక్టర్ అయిపోవాలని అనుకునే ఓ ఇంజినీరింగ్ కుర్రాడు.. ఒక్క సెల్ఫీతో ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడనే కాన్సెప్ట్ పై ఈ మూవీ సాగుతుంది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా.. వరుసగా ఇలా సెల్ఫీలపై సినిమాలు అంటే.. జనాలు యాక్సెప్ట్ చేస్తారంటావా అల్లరి రాజా!